ఈ వారం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ద‌స్ కా ద‌మ్‌

Tue,August 20, 2019 01:04 PM
ten movies releasing on august 23

ఇక ఈ వారంతో చిన్న సినిమాల టైం ముగిసిన‌ట్టే. పెద్ద సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర విశ్వ‌రూపం చూపించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌య్యాయి. ఆగ‌స్ట్ 30న సాహో, ఆ త‌ర్వాత గ్యాంగ్ లీడ‌ర్, వాల్మీకి, సైరా వంటి చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ శుక్ర‌వారం (ఆగ‌స్ట్ 23) దాదాపు ప‌ది సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ద‌మ‌య్యాయి. వీటిలో ఏ సినిమా ప్రేక్ష‌కుల‌ని ఎక్కువ‌గా అల‌రిస్తుంద‌నే దానిపై అభిమానుల‌లో సందిగ్ధం నెల‌కొంది.

తమిళ్‌లో సక్సెస్‌ అయిన కనా సినిమా తెలుగులో కౌసల్యా కృష్ణమూర్తి పేరుతో రీమేక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం శుక్ర‌వారం రిలీజ్ కానుంది. ఏదైనా జరగొచ్చు సినిమా కూడా శుక్ర‌వార‌మే విడుద‌ల కానుంది. ఈ రెండు సినిమాల‌పై కాస్త అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు బాయ్‌, ఉండిపోరాదే, నివాసి, హవా , నేనే కేడీ నెం 1, జిందా గ్యాంగ్‌, నీతోనే హాయ్‌ హాయ్‌, కనులు కనులు దోచేనే వంటి చిత్రాలు కూడా శుక్ర‌వారమే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాల‌కి సంబంధించిన హ‌డావిడి పెద్ద‌గా లేక‌పోవ‌డంతో ఈ చిత్రాలు ప్రేక్ష‌కాద‌రణ పొందడం కాస్త క‌ష్ట‌మ‌నే చెప్ప‌వ‌చ్చు.

1559
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles