తెలుగు హీరోలు నిజాయితీగా ఉంటారు..

Tue,April 24, 2018 09:57 PM
Telugu heroes better than kollywood heroes says gnanavel raja


ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా భార్య నేహా కొంతమంది హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా జ్ఞాన్ వేల్ రాజా ఇలాంటి కామెంట్స్ చేసి వార్తల్లోకెక్కారు. కోలీవుడ్ హీరోలు స్వార్థపరులని, వారు సినిమాకు రూ.50 కోట్ల పారితోషికం తీసుకుంటారని ఆరోపణలు చేశారు జ్ఞాన్ వేల్ రాజా. ఇటీవల జరిగిన ఓ మూవీ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ..వంద కోట్ల కలెక్షన్లు తీసుకురాగలిగే సామర్థ్యమున్న తెలుగు హీరోలు ఒక్క సినిమాకు కేవలం రూ.15 కోట్లు తీసుకుంటారని..కానీ తమిళ హీరోలు అలా కాకుండా 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారని మండిపడ్డారు. ఈ విషయంలో తమిళ హీరోలు తెలుగువారిని చూసి ఎంతో నేర్చుకోవాలని సూచించారు. ఉత్తరాదిన తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఉందని, తమిళ సినిమాలకు మాత్రం లేదని అన్నారు.

3939
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS