సెక్స్ రాకెట్‌లో దొరికిన తెలుగు నిర్మాత‌, ఆయ‌న భార్య!

Thu,June 14, 2018 11:14 AM
Telugu film producer, wife arrested in Chicago for sex racket

యూఎస్‌లో తెలుగు నిర్మాత‌, ఆయ‌న భార్య సెక్స్ రాకెట్‌లో దొర‌క‌డం సంచ‌ల‌నం సృష్టించింది. కిష‌న్ మోదుగుమూడి అలియాస్ విభా జ‌యమ్ మ‌రియు అత‌ని భార్య చంద్ర మోదుగుమూడి చికాగో కేంద్రంగా సెక్స్ రాకెట్ న‌డిపించ‌డం అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల‌లో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు హీరోయిన్స్‌తో పాటు యాంకర్స్‌ని సినిమా షూటింగ్‌లు, ఈవెంట్స్ పేరుతో తాత్కాలిక వీసా ఇప్పించి అమెరికాకి తీసుకెళ్ళ‌డం, అక్క‌డ ఖ‌రీదైన హోటల్స్‌లో వారిని ఉంచి విటుల‌ని పంప‌డం కొన్నాళ్ళుగా జ‌రుగుతూ వ‌స్తుంది. ఈ స్కాంని అమెరికా పోలీసులు బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. హీరోయిన్లను డల్లాస్, న్యూజెర్సీ, వాషింగ్టన్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లకు పంపే కిషన్, చంద్రలు, వారి వద్దకు కస్టమర్లను తీసుకెళ్లేవారని, స్వల్ప సమయం వారితో గడిపేందుకు విటుల నుంచి 3 వేల డాలర్స్ వసూలు చేస్తారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. వారిద్ద‌రిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు విష‌యంలో పూర్తిగా విచార‌ణ జ‌రిపి త్వ‌ర‌లో పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు.

పోలీసులు కిషన్, చంద్రల మొబైల్స్ స్వాధీనం చేసుకొని వారి సోష‌ల్ నెట్‌వర్క్స్‌తో పాటు మెయిల్స్‌ని కూడా చెక్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇన్వెస్టిగేష‌న్‌లో ప‌లు కండోమ్ ప్యాకెట్స్ కూడా దొరికిన‌ట్టు పోలీసులు తెలిపారు. అయితే ఓ హీరోయిన్ త‌న‌ని మాన‌సిక క్షోభ గురి చేయోద్ద‌ని ఇలాంటి బిజినెస్‌లో నన్ను భాగం చేయోద్దంటూ వేడుకున్న మెయిల్ ఒక‌టి ద‌ర్యాప్తులో దొరికింద‌ని పోలీసులు అన్నారు. చాలా కాలంగా సెక్స్ రాకెట్ న‌డుపుతున్న కిష‌న్ తెలుగు హిట్ సినిమాల‌కి కో ప్రొడ్యూస‌ర్‌గా కూడా వ్య‌వ‌హరించాడు. ఈ కేసుపై పూర్తి విచార‌ణ జ‌రిపి అన్ని విష‌యాలు మీడియాకి వివ‌రిస్తామ‌ని అమెరికా పోలీసులు పేర్కొన్నారు.

12098
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles