ప్రముఖ తెలుగు దర్శకుడు కన్నుమూత

Thu,September 13, 2018 05:56 PM
telugu director knt sastry passes away

హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు కేఎన్‌టీ శాస్త్రి కన్నుమూశారు. వివిధ విభాగాల్లో 12 అంతర్జాతీయ, 7 జాతీయ అవార్డులను కేఎన్‌టీ శాస్త్రి గెలుచుకున్నారు. పత్రికల్లో జర్నలిస్టుగా కేఎన్‌టీ శాస్త్రి తన కెరీర్‌ను ప్రారంభించారు. సినీ దర్శకుడు, విమర్శకుడు, రచయితగా శాస్త్రి ప్రసిద్ధి చెందారు. తిలదానం, కమిలి తదితర చిత్రాలకు శాస్త్రి దర్శకత్వం వహించారు.

సినీ విమర్శకుడిగా శాస్త్రి సినీరంగంపై పలు పుస్తకాలు రాశారు. ఉత్తమ సినీ విమర్శకుడిగానే శాస్త్రి జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్నారు. తర్వాత ఉత్తమ సినీ పుస్తకాన్ని రచించినందుకు రెండు జాతీయ అవార్డులను అందుకున్నారు. ఉత్తమ సందేశాత్మక చిత్రానికి గాను ఆయన మరో అవార్డు అందుకున్నారు. సురభి నాటకం డాక్యుమెంటరీకి కూడా నేషనల్ అవార్డు వచ్చింది. తర్వాత తిలాదానం సినిమాతో ఆయన దర్శకుడిగా మారారు. బాలీవుడ్ నటి నందితాదాస్ హీరోయిన్‌గా తీసిన కమిలి చిత్రాన్ని దక్షిణ కొరియాలోని బూసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌తో పాటు మరో పది దేశాల్లో ప్రదర్శించారు. ఆ సినిమా కర్ణాటక ప్రభుత్వం నుంచి బెస్ట్ అవార్డు అందుకున్నది. నందిత కూడా ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు. తిలాదానం సినిమాకు కూడా శాస్త్రి నంది అవార్డు అందుకున్నారు. ఆయన ఎప్పుడూ పెద్ద నటులతో, భారీ స్థాయి బడ్జెట్ సినిమాల జోలికి వెళ్లలేదు. చిన్న బడ్జెట్‌లో పలు సందేశాత్మక సినిమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు ఆయన పది దాకా సినిమాలు తీశారు. అవన్నీ సందేశాత్మక సినిమాలే.

19407
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles