వాట్ ఏ చేంజ్ అంటూ విషెస్ తెలిపిన తేజూ

Fri,January 19, 2018 02:22 PM
వాట్ ఏ చేంజ్ అంటూ విషెస్ తెలిపిన తేజూ

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఓ అభిమాని ఎడిట్ చేసిన ఫోటోని షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ చెప్పాడు. రానున్న రోజులలో మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాని కూడా తన ట్వీట్ లో తెలిపాడు. మరి తేజూ విషెస్ చెప్పింది మరెవరికో కాదు నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ కి. పుట్టిన రోజు సందర్భంగా , ఆయనతో కలిసి దిగిన అప్పటి, ఇప్పటి ఎడిట్ ఫోటోని షేర్ చేశాడు సాయి ధరమ్ తేజ్. ఇప్పుడు ఈ ఫోటోపై ఆసక్తికర చర్చ నడుస్తుంది. అప్పటి ఫోటోలో ఇద్దరు హీరోలు చాలా లావుగా ఉండగా, ఇప్పుడు మాత్రం చాలా చేంజ్ అయ్యారు. వీరి డెడికేషన్ పై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం వరుణ్, సాయి ధరమ్ తేజ్ వైవిధ్యమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వరుణ్ తొలి ప్రేమ అనే సినిమాతో ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుండగా, సాయిధరమ్ మాస్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో ఇంటిలిజెంట్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత కరుణాకరణ్ దర్శకత్వంలోను క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు .


1983

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018