బిగ్ బాస్ నుండి తేజ‌స్వీ ఔట్..!

Sun,July 22, 2018 10:05 AM
Tejaswi Madivada out from bigg boss

బిగ్ బాస్ సీజ‌న్ 2 రోజురోజుకి మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. బిగ్ బాస్ హౌజ్‌లో ఏదైన జ‌ర‌గొచ్చు అని నాని చెప్పిన‌ట్టుగానే మ‌నం ఊహించ‌ని విధంగా ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ‌ జ‌రుగుతుంది. హౌజ్‌లో కాస్త యాక్టివ్‌గా ఉండ‌డంతో పాటు వివాదాలు సృష్టించిన భాను ఇప్ప‌టికే ఎలిమినేట్ కాగా, ఈ వారం తేజ‌స్వీని ఎలిమినేట్ అవుతుంద‌ని తెలుస్తుంది. ఈ రోజు ప్ర‌సారం కానున్న ఎపిసోడ్ ముందుగానే షూట్ జ‌రుపుకోగా, అందులో పాల్గొన్న‌ ఆడియ‌న్స్ సోష‌ల్ మీడియాలో తేజ‌స్వీ ఎలిమినేట్ అయిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొంద‌రు తేజూతో ఫోటోలు దిగి, షీ ఈజ్ బ్యాక్ అనే కొటేష‌న్స్ రాస్తున్నారు. ప్ర‌స్తుతం ఎలిమినేష‌న్ కోసం కౌశ‌ల్‌, తేజ‌స్వీ నామినేష‌న్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

నిన్న‌టి ఎపిసోడ్‌లో ఇంటి స‌భ్యులు తాము హౌజ్‌లోకి ఎందుకు వ‌చ్చామ‌నే విష‌యం చెప్పిన విష‌యం విదిత‌మే. నేను బిగ్ బాస్ హౌస్‌కి వచ్చింది డబ్బులు కోసమే. ఈ 100 రోజుల్లో నేను ఎన్ని సినిమాలు చేసిన, ఈవెంట్‌లకు వెళ్లినా ఏం చేసినా యాభై లక్షలు సంపాదించలేను. అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తరువాత ఇక్కడ చాలా మందితో బాగా కనెక్ట్ అయ్యాను. ముఖ్యంగా తనీష్‌, సామ్రాట్‌లతో. నన్ను నేను తనీష్‌లో చూసుకుంటా. నాకు బిగ్ కాంపిటేషన్ అంటే తనీష్ అనేది నా భావన అంటూ తేజూ చెప్పుకొచ్చింది. అయితే మంచి- చెడు టాస్క్‌లో భాగంగా భానుతో పాటు తేజూ ప్ర‌వ‌ర్తించిన తీరు ప్రేక్ష‌కుల‌కి న‌చ్చ‌క‌పోవ‌డంతో వారు తేజూని ఎలిమినేట్ చేసార‌ని అంటున్నారు. కౌశల్‌ వ్యవహారంలో చేసిన తప్పుకు ప్రేక్షకులు భానుని శిక్షించారని, తేజూ హౌస్‌ నుంచి నిష్క్రమించడానికి లక్ష కారణాలున్నాయని చెబుతున్నారు. ఇదే విష‌యాన్ని తేజూ కూడా నిన్న‌టి ఎపిసోడ్‌లో ఒప్పుకుంది.


5874
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles