తేజ త‌ర్వాతి చిత్రంపై తాజా అప్‌డేట్‌

Fri,June 29, 2018 11:52 AM
teja next movie fixed

నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో భారీ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న తేజ‌కి ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కించే బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చింది. కాని ఆ ఆఫర్‌ని త‌నంత‌టే తానే వ‌దులుకున్నాడు తేజ‌. ఇక వెంక‌టేష్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆట‌నాదే వేట‌నాదే అనే ప్రాజెక్ట్‌ని తేజ తెర‌కెక్కిస్తాడ‌ని అన్నారు. కాని ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఇక‌ రానాతో ఓ సినిమా చేయాల్సి ఉన్నా ఆయ‌న ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండ‌డం వ‌ల‌న అది పోస్ట్ పోన్ అయింది. ఈ క్ర‌మంలో తేజ ఎవ‌రితో ఎప్పుడు ఏ సినిమా చేయనున్నాడు అనే ఆలోచ‌న అభిమానుల‌లో మొద‌లైంది. అయితే ప్ర‌స్తుతం తేజ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఫిలింన‌గ‌ర్‌లో చక్క‌ర్లు కొడుతుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తేజ త‌దుప‌రి చిత్రం ఉంటుంద‌ని టాక్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్క‌నున్న‌ ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్ హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. ఇప్ప‌టికే కాజ‌ల్‌, బెల్లంకొండ శ్రీనివాస్ క‌లిసి వంశధార క్రియేషన్స్ బేనర్ పై శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు . మ‌రి తేజ ద‌ర్శ‌క‌త్వంలో కాజ‌ల్‌, బెల్లంకొండ శ్రీనివాస్ జంట‌గా సినిమా రూపొంద‌నుంద‌నే వార్త‌పై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

2010
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles