క్రికెట్ పోటీలో గెలిచిన వారి చేతుల మీదుగా పాట విడుద‌ల‌

Fri,June 1, 2018 08:38 AM

ఈ మ‌ధ్య కాలంలో సినిమా ప్ర‌చారాలు స‌రికొత్త మార్గంలో కొత్త పుంత‌లు తొక్కుతుంది. సినిమాని జనాల‌లోకి తీసుకెళ్ళాల‌ని చిత్ర బృందం విచిత్ర ఆలోచ‌న‌లు చేస్తుంది. తాజాగా తేజ్ ఐ ల‌వ్ యూ చిత్ర నిర్మాత‌లు క్రికెట్ పోటీ నిర్వ‌హించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇందులో గెలిచిన వారి చేతుల మీదుగా అంద‌మైన చంద‌మామ అనే తొలి పాట‌ని విడుద‌ల చేయించ‌నున్నారు. ఈ క్ర‌మంలో జూన్ 2న ఆర్జేస్‌ ( రెడియో జాకీ) వర్సెస్‌ తేజ్‌ ఐ లవ్‌ యూ టీమ్‌ క్రికెట్‌ లీగ్‌ ఆడబోతోంది. క‌రుణాక‌ర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో అంద‌మైన ప్రేమ క‌థా చిత్రంగా తేజ్ ఐ ల‌వ్ యూ చిత్రం తెర‌కెక్క‌గా, ఇందులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకంపై కె.ఎస్‌. రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 29న విడుద‌ల కానుంది. క‌వితాత్మ‌క భావ‌న‌లతో సాగే ప్రేమ క‌థాచిత్రంగా ఈ మూవీ ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, ఇందులో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌వ‌త‌రం ప్రేమికుడిగా క‌నిపించ‌నున్నాడు. అనుపమ పరమేశ్వరన్ మెమోరీ లాస్ పేషెంట్‌గా క‌నిపించ‌నుంద‌నే టాక్ . గోపి సుంద‌ర్ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఆయ‌న స‌మకూర్చిన బాణీల‌ని జూన్ 9న విడుద‌ల చేయ‌నున్నారు.


4704
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles