'తేజ్ ఐ లవ్ యూ' టీజ‌ర్ విడుద‌ల‌

Tue,May 1, 2018 11:35 AM
tej i love u teaser released

సాయిధ‌ర‌మ్ తేజ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌రుణాక‌ర‌న్ తెర‌కెక్కిస్తున్న చిత్రం తేజ్ ఐ ల‌వ్ యూ. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకంపై కె.ఎస్‌. రామారావు నిర్మిస్తున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌ల విడుద‌లైంది. దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. క‌వితాత్మ‌క భావ‌న‌లతో సాగే ప్రేమ క‌థాచిత్రంగా ఈ మూవీ ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, ఇందులో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌వ‌త‌రం ప్రేమికుడిగా క‌నిపించ‌నున్నాడు. అనుపమ పరమేశ్వరన్ అందంతో పాటు చక్కటి అభినయంతో ఆకట్టుకుంటుంది. కుటుంబ అనుబంధాలు మేళవించిన ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం అందరిని మెప్పిస్తుందని నిర్మాత‌లు అన్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ మొత్తం పూర్తి కాగా, ప్ర‌స్తుతం పారిస్‌లో పాటల్ని తెరకెక్కిస్తున్న‌ట్టు స‌మాచారం . మేడే సంద‌ర్భంగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇది సినిమాపై అంచ‌నాలు పెంచుతుంది. ఈ నెల‌లోనే మూవీ రిలీజ్‌కి ప్లాన్ చేసింది చిత్ర యూనిట్‌. మ‌రి తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.2155
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles