బిగ్ బాస్ హౌజ్‌లో మృతి చెందిన వ్య‌క్తి

Sun,September 9, 2018 08:33 AM
Technician dies after falling on the sets of Kamal Haasans show

పాపుల‌ర్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం హిందీతో పాటు తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం , క‌న్న‌డ భాష‌ల‌లో స‌క్సెస్ ఫుల్‌గా దూసుకెళుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే త‌మిళంలో ప్ర‌స్తుతం బిగ్ బాస్ సీజ‌న్ 2 న‌డుస్తుండ‌గా, ఈ కార్య‌క్ర‌మాన్ని క‌మ‌ల్ హోస్ట్ చేస్తున్నారు. షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిన ప్ర‌మాదంలో బిగ్ బాస్ హౌజ్‌లో ఓ వ్య‌క్తి మృతి చెందాడు. సెట్‌లో ఏసీకి సంబంధించి టెక్నిక‌ల్ స‌మ‌స్య‌ల‌ని సాల్వ్ చేసే క్ర‌మంలో మెకానిక్ సెకండ్ ఫ్లోర్ నుండి జారి కింద‌ప‌డ‌డంతో ఆయ‌న మృతి చెందాడు .శుక్ర‌వారం సాయంత్రం ఈ సంఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. మృతి చెందిన వ్య‌క్తి అరియలూరు జిల్లా మాత్తూరుకు చెందిన ఏసీ మెకానిక్‌ గుణశేఖరన్‌ (30) . త‌ల‌కి తీవ్ర‌గాయం కావ‌డం వ‌ల‌న‌నే ఆయన మృతి చెందార‌ని అంటున్నారు. నాజ‌ర్తెపేట్ పోలీసులు ఈ కేసుపై ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. బిగ్ బాస్ త‌మిళ కార్య‌క్ర‌మం పూందమల్లి సమీపంలోగల సెంబరంబాక్కం ప్రాంతంలో ఉన్న ఈవీపీ ఫిలిం సిటీలో జ‌రుగుతుంది. ఈ కార్య‌క్ర‌మంలో ప‌ద‌వ‌ ఎలిమినేష‌న్ జ‌ర‌గ‌నుండ‌గా జ‌న‌ని అయ్య‌ర్‌, ఐశ్వ‌ర్య ద‌త్త‌, సేంద్ర‌యాన్‌, వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో వచ్చిన విజ‌య్ ల‌క్ష్మీ లు డేంజ‌ర్ జోన్‌లో ఉన్నారు.

11009
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles