ఇండిపెండెన్స్ డేకి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వ‌నున్న ఎన్టీఆర్

Sun,July 8, 2018 09:42 AM
Teaser Release Date Locked For NTRs latest movie

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లో ‘అరవింద సమేత’ అనే క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా చిత్రం విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం చిత్రానికి సంబంధించి యాక్ష‌న్ సీన్స్ తెర‌కెక్కిస్తున్నాడు త్రివిక్ర‌మ్. మూవీ షూటింగ్ 50 శాతం పూర్తైన‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన చిత్ర ఫ‌స్ట్ లుక్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇక టీజ‌ర్‌ని స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేసి ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాల‌ని భావిస్తున్నార‌ట మేక‌ర్స్‌. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌ల‌సి ఉంది.

‘అరవింద సమేత’ చిత్రంలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ప్ర‌ధ‌మార్ధంలో సిద్ధార్ధ్ గౌత‌మ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న ఎన్టీఆర్ ద్వితీయార్ధంలో వీర రాఘ‌వగా క‌నిపించి అల‌రించనున్నాడ‌ట‌. సెకండాఫ్‌లో ఎన్టీఆర్ పాత్ర ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండ‌డంతో పాటు ఇది పూర్తి రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో ఉంటుంద‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ కూడా ప్రద‌ర్శించ‌నున్నాడ‌ట‌. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో ప‌వ‌ర్ ఫుల్‌గా క‌నిపించ‌నున్న ఎన్టీఆర్‌, హైద‌రాబాద్ నేప‌థ్యంలో సాగే సున్నిత‌మైన పాత్ర‌లోను మెప్పిస్తాడ‌ని అంటున్నారు. చిత్రంలో ల‌వ్ ట్రాక్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయ‌ని చెబుతున్నారు.

1808
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles