హ‌రికృష్ణ మృతి కార‌ణంగా టీజ‌ర్‌, ట్రైల‌ర్ రిలీజ్‌లు వాయిదా

Wed,August 29, 2018 10:47 AM
teaser and trailer launches post poned

ప్రముఖ తెలుగు సినిమా నటుడు మరియు రాజకీయ నాయకుడు నంద‌మూరి హ‌రికృష్ణ మృతికి సంతాపంగా టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు త‌మ సంతాపాన్ని తెలియ‌జేస్తూ కుటుంబానికి ప్ర‌గాడ సానుభూతి తెలియ‌జేస్తున్నారు. అయితే ఈ రోజు విశాల్ న‌టించిన పందెం కోడి 2 టీజ‌ర్ తో పాటు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో చైతూ, అను ఎమ్మాన్యుయేల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన శైల‌జా రెడ్డి అల్లుడు ట్రైల‌ర్ విడుద‌ల కావ‌ల‌సి ఉండ‌గా అవి వాయిదా ప‌డ్డాయి. పందెం కోడి టీజ‌ర్‌ని రేపు విడుద‌ల చేస్తున్న‌ట్టు టీం ప్ర‌క‌టించింది. ఇక శైలజా రెడ్డి అల్లుడు చిత్ర ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్‌ని త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర బృందం తెలిపింది. ఇక అక్కినేని నాగార్జున కూడా ఈ రోజు త‌న బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ జ‌రపొద్దని అభిమానుల‌కి తెలిపిన‌ట్టు స‌మాచారం. హ‌రికృష్ణ మృతి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కి తీర‌నిలోటు అంటూ ప‌లువురు సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు.3893
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles