'భార‌త్' సినిమా చూసిన భార‌త్ టీం.. ధ‌న్య‌వాదాలు తెలిపిన స‌ల్మాన్

Wed,June 12, 2019 11:42 AM

బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం ‘భారత్’. అలీ అబ్బాస్ జాఫర్ దర్వకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారత్ ఇప్ప‌టి వ‌ర‌కు 250 కోట్ల‌కి పైగా వ‌సూళ్ళ‌రు రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ చిత్రాన్ని హార్ధిక్ పాండ్యా, ఎంఎస్ ధోని, కేదార్ జాద‌వ్ శిఖర్ ధావ‌న్, రాహుల్‌తో పాటు టీమిండియా స్టాఫ్‌కి సంబంధించిన కొంద‌రు స‌భ్యులు నాట్టింగ్‌హామ్‌లోని ఓ థియేటర్‌లో మంగళవారం వీక్షించారు.


స‌ల్మాన్‌కి వీరాభిమాని అయిన జాద‌వ్ థియేట‌ర్‌లో భార‌త్ టీం దిగిన ఫోటోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. భార‌త్ సినిమా చూసిన త‌ర్వాత భార‌త జ‌ట్టుతో అని క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ పోస్ట్‌పై స‌ల్మాన్ కూడా స్పందించాడు. భార‌త్ సినిమాని ఇష్ట‌ప‌డిన భార‌త్ టీంకి ధ‌న్య‌వాదాలు. ఇంగ్లండ్‌లో భార‌త్ సినిమా చూసినందుకు మీ అంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. రానున్న మ్యాచ్‌ల‌లో మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను. భార‌తీయులు అంద‌రు మీకు స‌పోర్ట్‌గా ఉన్నారు అని త‌న ట్వీట్‌లో తెలిపాడు స‌ల్మాన్. ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ క‌ప్ టూర్‌లో భాగంగా ఇంగ్లండ్‌లో ఉన్న టీం ఇండియా త‌న త‌ర్వాతి మ్యాచ్‌ని న్యూజిలాండ్‌తో ఆడ‌నుంది. ఈ మ్యాచ్ రేపు మ‌ధ్యాహ్నాం 3 గంట‌ల‌కి ప్రారంభం కానుంది. ఆదివారం దాయాదుల‌తో పోరుకి సిద్ధం కానుంది. ఈ మ్యాచ్‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.2918
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles