ప‌వ‌న్ ప్ర‌శ్న‌ల‌కి నారా లోకేశ్ స‌మాధానం

Sat,April 21, 2018 10:53 AM
TDP Leader Nara Lokesh Responds pawan allegations

ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ప్రోత్సాహంతో ప‌వ‌న్ త‌ల్లిపై శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌కిగాను ప‌వ‌న్ నిన్న ఫిలిం ఛాంబ‌ర్‌కి వెళ్ళి నిర‌స‌న తెలిపిన సంగ‌తి తెలిసిందే. మీడియా వ్య‌వ‌హార‌శైలిని కూడా దుయ్య‌బ‌డుతూ త‌న ట్విట్ట‌ర్‌లో ప‌లు ట్వీట్స్ చేస్తూ వ‌స్తున్నాడు ప‌వ‌న్‌. మ‌రి కొద్ది క్ష‌ణాల‌లో మ‌రి కొంద‌రి పేర్లు కూడా బ‌య‌ట‌పెడ‌తాన‌ని కొన్ని ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశాడు. అయితే అసలు రాష్ట్రానికి మేలు జరగాలని ఆశించకుండా మీ తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి కృషి చేశాం. కానీ మీరు, మీ అబ్బాయి, అతని స్నేహితులు చేయూతనిచ్చిన చేతులను వెనుక నుంచి మీడియా శక్తుల ద్వారా విరిచేస్తుంటారు. మిమ్మల్ని ఎలా నమ్మడం?’ అని ట్విట్ట‌ర్ ద్వారా సూటిగా ప్ర‌శ్నించారు ప‌వ‌న్‌. గుంటూరు స‌భలోను నారా లోకేశ్‌పై ప‌వ‌న్ విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ప‌వ‌న్ త‌న‌పై చేసిన కామెంట్స్‌కి నారా లోకేశ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా బ‌దులిచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు, మీ వ్యాఖ్యలు చాలా బాధించాయి. ఇంతకు ముందు కూడా నా పై వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేసి మళ్ళీ ఎవరో చెపితే అన్నానన్నారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎన్నో ఏళ్ల శ్రమ ఫలితం. ఎవరో అన్న, విన్న మాటల ఆధారంగా ఆరోపణలు చేసే కుసంస్కారిని కాదు. వాస్తవాలన్నిటినీ కాలమే ప్రజల ముందు ఉంచుతుంది. మీ పట్ల నా హృదయంలో గౌరవ స్థానమే ఉంటుంది. మాతృదేవోభవ అని అన్నారు. మ‌రి దీనిపై ప‌వ‌న్ ఎలా స్పందిస్తాడో చూడాలి.4545
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles