టాక్సీవాలా న‌వంబ‌ర్‌లో వ‌చ్చేస్తున్నాడు

Sun,October 21, 2018 07:44 AM
taxiwala release date confirmed

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో అందరి దృష్టి ఆకర్షించిన విజయ్ దేవరకొండ రీసెంట్‌గా నోటా అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ చిత్రం అభిమానుల‌ని కాస్త నిరాశ ప‌ర‌చింది. తాజాగా డియ‌ర్ కామ్రేడ్ అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. అయితే విజ‌య్ న‌టించిన టాక్సీ వాలా చిత్రం ఎప్పుడో విడుద‌ల కావ‌ల‌సి ఉన్నా, గ్రాఫిక్ వ‌ర్క్ కార‌ణంగా రిలీజ్ లేట్ అవుతూ వ‌చ్చింది. తాజాగా చిత్ర రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారు. న‌వంబ‌ర్ 16న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా తెలిపారు. ఈ చిత్రంలో క‌థానాయికగా షార్ట్ ఫిలింస్ బ్యూటీ ప్రియాంక జవల్కర్ న‌టించింది. జీఏ2 పిక్చర్స్ మరియు యూవీ క్రియేషన్స్ బేనర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టాక్సీ డ్రైవర్ చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుందని తెలుస్తుంది. మాళవిక నాయర్ కూడా ఓ హీరోయిన్ గా క‌నిపించ‌నుంది . విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో శివ పాత్రలో టాక్సీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. రాహుల్ సంకృతియన్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం అభిమానుల‌ని అల‌రించ‌నుంద‌ని అంటున్నారు.

1681
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS