ప్రముఖ నిర్మాత కె. రాఘవ గుండెపోటుతో మృతి

Tue,July 31, 2018 06:34 AM
Tata manavadu producer. K Raghava passed away

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత కె. రాఘవ(105) గుండెపోటుతో మృతి చెందారు. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేతగా 30కి పైగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. సినీ ప్రముఖులు పార్థవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఇటీవల భార్య మృతి చెందడంతో రాఘవ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. రాజబాబు హీరోగా న‌టించిన చిత్రం తాతా మనుమడు సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.

1913లో తూర్పు గోదావరి జిల్లా కోటపల్లిలో జన్మించిన ఆయన నిర్మించిన 30 చిత్రాల్లో 25 బ్లాక్ బాస్టర్ హిట్ సాధించాయి. 1931లో సినీ రంగ ప్రవేశం చేసిన రాఘవ మనదేశం, భీష్మా, పలనాటి యుద్ధం, సుఖదుఖాలు వంటి హిట్‌ చిత్రాలు నిర్మించారు. ఎల్ వీ ప్రసాద్ వంటి ప్రముఖ దర్శకులను,ఎంతో మంది నటీ నటులను సినీపరిశ్రమకు మొదట పరిచయం చేసింది కె. రాఘవనే. ఎన్టీఆర్ నటించిన పాతాల బైరవి చిత్రంలో స్టంట్ డైరెక్టర్ గా పనిచేశారు. కోటపల్లి రాఘవ రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు.

4031
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles