పెళ్ళికి సిద్ధ‌మంటున్న త‌రుణ్‌..!

Tue,January 16, 2018 12:23 PM
tarun movie in this year

ఒకప్పుడు లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న తరుణ్ ఈ మధ్య సినిమాలు అంతగా చేయడం లేదు. 2014 లో వచ్చిన వేట చిత్రం తరుణ్ కి చివరి మూవీ కాగా, మళ్ళీ ఇప్పుడు ఇది నా లవ్ స్టోరీ చిత్రాన్ని చేస్తున్నాడు. రమేష్ గోపి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తరుణ్ సరసన ఒవియా హెలెన్ కథానాయికగా నటిస్తుంది. ఎస్ వి ప్రకాశ్ నిర్మాణంలో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి శ్రీనాథ్ విజయ్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవ‌ల చిత్ర ట్రైలర్ ని తన ఫేస్ బుక్ వేదికగా విడుదల చేశాడు తరుణ్. ఇది అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే త‌న‌ పెళ్ళి కోసం కొంత కాలం నుండి ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌స్తున్న ఫ్యాన్స్‌కి త‌రుణ్ గుడ్ న్యూస్ చెప్పిన‌ట్టు స‌మాచారం. అత‌ని త‌ల్లి రోజా ర‌మ‌ణి కోరిక మేర‌కు పెళ్ళి పీట‌లెక్కేందుకు సిద్ద‌మ‌య్యాడ‌ట త‌రుణ్‌. ఈ ఏడాదిలో త‌రుణ్ వివాహం జ‌రగ‌నుంద‌ని తెలుస్తుంది. బాల న‌టుడిగా ప‌లు సినిమాలు చేసిన త‌రుణ్ 2000 సంవత్స‌రంలో వ‌చ్చిన నువ్వే కావాలి మూవీతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు.

2229
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS