హీరోగా ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్..?

Mon,October 15, 2018 06:08 PM
tarun bhaskar to turn as hero with vijaydevarkonda

హైదరాబాద్ : తరుణ్‌భాస్కర్, విజయ్‌దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కిన పెళ్లి చూపులు సినిమా బాక్సాపీస్ ఏ స్థాయి వసూళ్లను రాబట్టిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తక్కువ బడ్జెత్‌తో చిన్న సినిమాగా తెరకెక్కి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత విజయ్ వరుస ఆఫర్లతో బిజీ అయిపోయాడు. ఇక ఈ చిత్రం తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాన్ని తెరకెక్కించాడు తరుణ్‌భాస్కర్. చాలా రోజుల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి తెరపై కనిపించేందుకు రెడీ అయ్యేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే కొత్త సినిమాతో డైరెక్టర్ తరుణ్‌భాస్కర్ హీరోగా మారునున్నాడనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.

విజయ్‌దేవరకొండ ఇటీవలే ‘నోటా’ సినిమాలో కింగ్ ఆఫ్ ద హిల్స్ పేరుతో ప్రొడక్షన్ హౌజ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. విజయ్ తన నిర్మాణ సంస్థ నుంచే తరుణ్‌భాస్కర్‌ను హీరోగా లాంఛ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. యువత చుట్టూ కథాంశంతో ఇప్పటికే ఓ కథను సిద్ధం చేశారని, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై స్పష్టత రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

3532
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles