బాహుబలికి దీటుగా బాలీవుడ్ చిత్రం ..!

Fri,July 21, 2017 03:12 PM
Tanaji movie beats baahubali

ఇండియన్ సినిమా స్థాయిని పదింతలు పెంచి విమర్శకులతోనే ఔరా అనిపించిన చిత్రం బాహుబలి. రాజమౌళి దర్శకత్వంలో రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం పలు రికార్డులు సాధించింది. బాలీవుడ్ మూవీ కూడా అందుకోని రికార్డులని బాహుబలి 2 అందుకుంది. అయితే ఇప్పుడు ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ దర్శక నిర్మాతలు బాహుబలి చిత్రాన్ని టార్గెట్ గా పెట్టుకొని సినిమాలు తీస్తున్నారు. ఇప్పటికే 2.0 చిత్రం భారీ రేంజ్ లో తెరకెక్కి, విడుదలకి సిద్దం అయింది. ఇక త్వరలో సంఘమిత్ర చిత్రం అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఇక మోహన్ లాల్ మహా భారతం కూడా అదే రేంజ్ లో రూపొందనుంది.

బాలీవుడ్ లోను బాహుబలిని మించిన సినిమా తీయాలని దర్శక నిర్మాతలు కసరత్తులు చేస్తున్నారు . ఈ క్రమంలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో తానాజీ అనే చిత్రం రూపుదిద్దుకోనుంది. ఓమ్ రౌత్ తెరకెక్కించనున్న ఈ చిత్రం మరాఠా వీరుడు సుబేదార్ తానాజీ మలుసరే జీవిత నేపథ్యంలో రూపొందనుంది. భారత చరిత్రలో కీర్తించని యుద్ధవీరుడు సుబేదార్‌ తానాజీ మలుసరే. తన ప్రజలు, తన నేల తల్లి, తన రాజు ఛత్రపతి శివాజీ కోసం ఎంతగానో పోరాడారు తానాజీ. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదల చేశారు. ఇది సినీ అభిమానులలో వైబ్రేషన్స్ కలుగ చేస్తుంది. బాహుబలి స్థాయిలో ఈ మూవీ రూపొందనుందని తెలుస్తుండగా, ఈ సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

3965
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles