హ‌రితేజ‌కి జ‌రిగిన అవ‌మానంపై ఫైర్ అయిన త‌మ్మారెడ్డి

Fri,May 25, 2018 12:04 PM
tammareddy fire on negative comment people

బిగ్ బాస్ తో ఫుల్ పాపులర్ అయిన ఆర్టిస్ట్ హరితేజ. సినిమాలలోను సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ మరో వైపు యాంకర్ గాను రాణిస్తుంది . అయితే ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న హరితేజ వీలు చూసుకొని తన ఫ్యామిలీతో ఇటీవ‌ల మ‌హాన‌టి థియేటర్ కి వెళ్లింది . ఫస్ట్ హాఫ్ లో తన చెల్లి పక్కన కూర్చొని సినిమా చూసిన హరితేజ, సెకండాఫ్ లో తన తల్లి పక్కన కూర్చోవాలనుకుంది. ఈ క్రమంలో తన తండ్రిని పక్క సీటుకి వెళ్ళమని కోరగా, ఆ పక్కనే ఉన్న మహిళ అతని పక్కన మా అమ్మాయి కూర్చోదని అభ్యంతరం వ్యక్తం చేసిందట. అంతేకాదు మీ సినిమా వాళ్ళలా మేము అందరి పక్కన కూర్చోలేమంటూ చులకనగా మాట్లాడిందట. ఈ విషయాన్ని లైవ్ వీడియో ద్వారా చెబుతూ కన్నీటి పర్యంతమైంది హరితేజ. ఈ విష‌యంపై టాలీవుడ్ ద‌ర్శ‌క‌ నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ తీవ్రంగా స్పందించారు.

నా ఆలోచ‌న పేరుతో కొన్నాళ్ళుగా స‌మాజంలో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల‌పై యూ ట్యూబ్ ద్వారా స్పందిస్తున్నారు త‌మ్మారెడ్డి. తాజాగా హ‌రితేజతో పాటు సినిమా వాళ్ళ గురించి ఓ మ‌హిళ మాట్లాడిన మాట‌ల‌పై సీరియ‌స్‌గా స్పందించారు . మా గురించి త‌ప్పుగా మాట్లాడే వారు ఏమైన స‌రైనోళ్లా, మ‌మ్మ‌ల్ని స‌ర్టిఫికెట్ అడుగుతున్న‌ప్పుడు , మీరు స‌ర్టిఫికెట్ తీసుకొచ్చి మా పక్క‌న కూర్చొండి. బ‌స్సుల‌లో, విమానాల‌లో , రైళ్ళ‌ల‌లో మీ ప‌క్క‌న కూర్చునే వాళ్లంద‌రు మంచోళ్ల‌నే న‌మ్మి మీరు కూర్చుంటారా .. అంటూ ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. సినిమా వాళ్ల‌ను చిన్న చూపు చూడొద్దు. మేము మ‌నుషుల‌మే. ప్రేక్ష‌కులని మేము దేవుళ్ళ‌గా చూస్తున్న‌ప్పుడు మీరు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం దారుణం అని ఆయ‌న అన్నారు. ఇక చివ‌రిగా త‌న మాట‌లు బాధ‌పెడితే క్ష‌మించాల‌ని కోరాడు త‌మ్మారెడ్డి. మ‌రి ఆయ‌న మాట్లాడిన మిగతా విష‌యాల‌ని ఈ వీడియో ద్వారా వినండి.

5365
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles