క‌మ‌ల్ 'విశ్వ‌రూపం 2' సాంగ్ విడుద‌ల‌

Sat,June 30, 2018 10:03 AM
Tamil Naanaagiya Nadhimoolamae Lyric video

కమల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విశ్వరూపం 2. విశ్వ‌రూపం చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది . కొన్నాళ్ళు అటకెక్కిన ఈ ప్రాజెక్ట్ ఈ మధ్య పోస్ట్ ప్రొడక్షన్స్, డబ్బింగ్ పనులు శరవేగంగా జరుపుకొని రిలీజ్ కి సిద్ధ‌మైంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానున్న విశ్వరూపం 2 చిత్రంలో రాహుల్ బోస్, పూజా కుమార్ మరియు ఆండ్రియా, నాజ‌ర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. విశ్వ‌రూపం చిత్రంలో అవినీతితో పాటు కొన్ని సంఘ‌ట‌న‌లకి సంబంధించిన సీన్స్ అభిమానుల‌లో ఎంతో ఆస‌క్తిని రేకెత్తించాయి. ఇండియాలోనే కాదు విదేశాల‌లోను విశ్వ‌రూపం 2 మూవీపై భారీ ఆస‌క్తి నెల‌కొంది. ఈ చిత్ర ట్రైల‌ర్ ఇటీవ‌ల విడుద‌ల కాగా, ఇది సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది. త్వ‌ర‌లోనే ఆడియో వేడుక‌కి ప్లాన్ చేయ‌గా, రీసెంట్‌గా సినిమా నుండి లిరిక‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. క‌మ‌ల్ హాస‌న్‌, కౌశికి చ‌క్ర‌వ‌ర్తి, మాస్ట‌ర్ కార్తీక్‌, సుర‌ష్ అయ్య‌ర్‌లు పాడిన ఈ పాట సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది.

1516
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles