జ‌న‌వ‌రిలో రెండు రోజులు షూటింగ్ ర‌ద్దు

Sun,December 17, 2017 05:46 PM
Tamil Film Producer Council cancel shooting

ఈ మ‌ధ్య కాలంలో అనేక కార‌ణాల వ‌ల‌న షూటింగ్‌లు ర‌ద్దు అవుతున్న‌ విష‌యం విదిత‌మే. ముఖ్యంగా కోలీవుడ్‌లో ప‌లు మార్లు షూటింగ్‌కి బ్రేక్ ప‌డింది. జ‌న‌వ‌రి 5,6 తేదీల‌లో త‌మిళ సినిమా షూటింగ్స్ ర‌ద్దు కానున్నాయి. అయితే ఈ సారి షూటింగ్స్ జ‌ర‌గ‌క‌పోవ‌డానికి కార‌ణం స‌మ్మెల వ‌ల‌న కాదు. ఓ మంచి ప‌ని కోసం సినీ తార‌లంతా మ‌లేషియా వెళుతున్న నేప‌థ్యంలో రెండు రోజుల పాటు షూటింగ్‌ల‌కి బ్రేక్ ఇచ్చారు. దక్షిణ భారత నటీనటుల సంఘం భవన నిర్మాణం కోసం సంఘ నిర్వాహకులు ప‌లు ర‌కాలుగా నిధుల‌ని సేక‌రిస్తున్నారు. ఇందులో భాగంగా దక్షిణ భారత నటీనటుల సంఘం మ‌లేషియా ప్రభుత్వంతో క‌లిసి క్రికెట్‌, ఫుట్‌బాల్ వంటి క్రీడలతో పాటు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు జనవరి 6వ తేదీన మలేషియాలోని బుకట్‌ జలీల్‌ ఇండోర్‌ స్టేడియంలో గ్రాండ్‌గా జరగనున్నాయి. దీనికి త‌మిళ స్టార్స్ క‌మ‌ల్ హాస‌న్‌, ర‌జ‌నీకాంత్‌తో పాటు 200 మంది క‌ళాకారులు హాజ‌రు కానున్నార‌ని తెలుస్తుంది. ఈ కార‌ణంగా జనవరి 5,6 తేదీల్లో షూటింగ్‌లను రద్దు చేయాలన్న నటీనటుల సంఘ నిర్ణయానికి నిర్మాతల సంఘం సినీ సమాఖ్యలు మద్దతు తెలపడంతో ఆ తేదీల్లో షూటింగ్‌లను రద్దు చేస్తున్నట్లు తెలుస్తుంది. భ‌వ‌న నిర్మాణం కోసం చెన్నైలోను స్టార్ క్రికెట్ నిర్వ‌హించి కొంత నిధిని సేక‌రించిన సంగతి తెలిసిందే.

1543
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles