అనుష్క త‌మిళ మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Sun,November 26, 2017 03:03 PM
tamil dub movie first look released

తెలుగు సినిమాల మార్కెట్ రాను రాను పెరుగుతోంది. సీనియర్ హీరోలు, యంగ్ హీరోల మూవీస్ తమిళం, మలయాళంలోకి డబ్ అవుతున్నాయి. తమిళనాడులో తెలుగు వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి తమిళంలో చాలా సినిమాలు డబ్ అవుతుంటాయి. లేటెస్ట్ గా నాగ్ న‌టించిన‌ మూవీని కూడా డబ్ చేసి విడుద‌ల‌కి సిద్ధం చేస్తన్నారు. సాంఘిక చిత్రాల్లోనే కాక, భక్తిరస ప్రధానమైన సినిమాల్లో కూడా మెప్పిస్తున్న నాగార్జున సినిమాను కోలీవుడ్ లో రిలీజ్ చేయబోతుండ‌డం విశేషం.

రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున నటించిన భక్తిరస చిత్రం ' ఓం నమో వేంకటేశాయ'. వేంకటేశ్వర స్వామికి మహా భక్తుడైన 'హథీ రామ్ బావాజీ' జీవితచరిత్రనే చలనచిత్రంగా తీశారు. శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుడు హాథీరామ్ బావాగా నాగార్జున ఈ సినిమాలో చక్కని నటనను కనబరిచాడు. ఈ సినిమాను డబ్ చేసి తమిళంలో విడుదల చేయ‌బోతున్నారు.. అదివరకు అక్కినేని నాగేశ్వరరావు సినిమాలు కూడా తమిళంలోకి అనువదించి విడుదల చేశారు.

హథీ రామ్ బావాజీ గురించిన చరిత్ర తమిళ ప్రజలకు తెలుసట. అందువలన ఈ సినిమాను అనువాదంగా అక్కడ విడుదల చేస్తే బాగుంటుందని అనుకున్నారు. ఈ క్ర‌మంలో ఓం న‌మో వెంక‌టేశాయ చిత్రం కూడా త‌మిళంలో విడుద‌ల అవుతుంది. బ్ర‌హ్మ‌నంద న‌య‌గ‌న్ అనే టైటిల్‌తో ఈ చిత్రం త‌మిళంలో విడుద‌ల కానుండ‌గా, తాజాగా అనుష్క ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. కృష్ణమ్మ గెటప్‌లో అనుష్క అదిరింద‌ని త‌మిళ ప్రేక్ష‌కులు చెప్పుకుంటున్నారు. రాఘ‌వేంద్ర‌ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఓం న‌మో వెంక‌టేశాయ చిత్రం తెర‌కెక్క‌గా, ప్ర‌గ్యా జైస్వాల్ కూడా ఇందులో కీల‌క పాత్ర పోషించింది. ఇదివరకు నాగ్ నటించిన కొన్ని సినిమాలు తమిళంలో విడుద‌ల కాగా, 2015లో వచ్చిన ఇంజి ఇదుప్ప జగి అనే తమిళ మూవీలో నాగ్ ఓ చిన్న పాత్ర వేశాడట కూడా.



3309
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles