48 గంటల పాటు నాన్‌స్టాప్ షూటింగ్‌లో స్టార్ హీరో

Wed,February 20, 2019 01:50 PM
Tamil Actor Vishal shoots for 48 hours non stop for the movie Ayogya

తమిళ స్టార్ హీరో విశాల్ సినిమా షూటింగ్స్‌లో ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటాడు అనడానికి ఇది తాజా నిదర్శనం. అతడు ప్రస్తుతం ఆయోగ్య అనే మూవీ చేస్తున్నాడు. ఏఆర్ మురగదాస్ దగ్గర అసోసియేట్‌గా పని చేసిన వెంకట్ మోహన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం ముఖ్యమైన కోర్టు సీన్‌ను చిత్రీకరిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కోర్టు సెట్టింగ్ కూడా వేశారు. మూడు రోజుల పాటు ఏకధాటిగా ఈ షూటింగ్ జరుగుతున్నది. ఇందులో హీరోయిన్ రాశి ఖన్నా, పార్థీపన్, రాధా రవి, కేఎస్ రవికుమార్‌లాంటి నటులు కూడా పాల్గొన్నారు. అయితే ఎవరి షూటింగ్ వాళ్లు చేసుకొని వెళ్లిపోగా.. విశాల్ మాత్రం ఏకధాటిగా 48 గంటల పాటు సెట్స్‌లోనే షూటింగ్‌కు అందుబాటులో ఉండటం విశేషం. సినిమాలో ముఖ్యమైన సన్నివేశం కావడంతో అతడు పూర్తి నిబద్ధతతో పని చేశాడని, అతని కమిట్‌మెంట్ చూసి సినిమా యూనిట్ అంతా ఆశ్చర్యంలో మునిగిపోయిందని ఈ సినిమా వర్గాలు వెల్లడించాయి. తెలుగులో వచ్చిన టెంపర్ మూవీకి ఇది రీమేక్ కావడం విశేషం. ఇప్పటికే హిందీలో ఇది సింబాగా వచ్చిన సంగతి తెలిసిందే.

3191
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles