ట్రైన్‌లో ‘తమాషా’ జర్నీ

Mon,November 23, 2015 12:49 PM
tamasha team enjoys train journey from mumbai to delhi

ముంబై : బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేస్తున్నారు. భారతీయ రైల్వేకు ఓ సెలబ్రిటీ స్టేటస్ తీసుకొస్తున్నారు. మొన్నే బిగ్ బి అమితాబ్ ముంబై లోకల్ ట్రైన్‌లో ఓ రౌండేశాడు. క్యాన్సర్ ఫండ్ కోసం రంగ్ బర్సే అంటూ సాంగ్స్‌తో థ్రిల్ చేశాడు కూడా. ఇప్పుడు ‘తమాషా’ టీమ్ అదే చేసింది. ముంబై నుంచి ఢిల్లీ వరకు రణబీర్ కపూర్, దీపాక పదుకునేలు రైళ్లో ప్రయాణం చేశారు. తమాషా సినిమా ప్రమోషన్ కోసం ఈ స్టార్స్ ఇద్దరూ ఢిల్లీ వెళ్లారు. వీళ్లతో పాటు ఆ ఫిల్మ్ డైరక్టర్ ఇంతియాజ్ అలీ కూడా ట్రైనెక్కాడు.

తమాషా స్టార్స్ రాత్రంతా రైళ్లోనే సందడి చేశారు. చాటింగ్ చేస్తూ, జోకులు వేస్తూ ఫుల్ హంగామా చేశారు. అంతేకాదు. ఓ స్టేషన్లో దిగి టీ కూడా పుచ్చుకున్నారు. రెండేళ్ల క్రితం విడుదలైన యే జవానీ హై దివానీ సినిమాలో దీపికా నటించింది. అప్పుడు ఆ సినిమా కోసం ఆమె ట్రైనెక్కింది. చాన్నాళ్ల తర్వాత మళ్లీ రైలెక్కాలని ఆమెకు కోరిక పుట్టిందట. దీంతో ఆ ఫిల్మ్ ప్రమోషన్ కోసం ఈ ప్లానేశారు.

నిజానికి ఢిల్లీ వెళ్లేందుకు ముందే ఫ్లయిట్ బుక్ చేశారు. కానీ దీపికా ట్రైనెక్కాలన్న కోరిక తీర్చేందుకు ఆ టికెట్లను రద్దు చేశారు. వెంటనే రైలు టికెట్లను కొన్నారు. ఇంకేముందు. రైల్ ప్రయాణికులతో మజా చేస్తూ తమాషా టీమ్ రయ్ రయ్ మంటూ ఢిల్లీ చేరుకుంది. గంటలో గమ్యాన్ని చేరుకోవాల్సిన వాళ్లు..రాత్రంతా రైల్లో ముచ్చట్లతో గడిపేశారు. ట్రైన్‌మే తమాషా అంటూ ఫిల్మ్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా ప్రమోట్ చేసుకున్నారు.

1938
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS