డీజే స్నేక్ ఛాలెంజ్ గెలిచిన తమన్నా..వీడియో

Wed,May 16, 2018 04:19 PM
tamannah wins DJ Snake challenge shared a vedio


బాహుబలి సినిమాలో అవంతిక పాత్రలో కనిపించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. మాస్, క్లాస్ సాంగ్స్ ఇలా ఏ పాటలోనైనా మెస్మరైజ్ చేసే స్టెప్పులతో ఆడియెన్స్‌ను కట్టిపడేస్తుంది తమన్నా. యాక్టింగ్‌తోపాటు డ్యాన్స్‌లో కూడా యాక్టివ్‌గా ఉండే ఈ హీరోయిన్ ఓ ఛాలెంజ్‌లో అవలీలగా గెలిచేసింది. పారిస్‌కు చెందిన ప్రముఖ డీజే (డిస్క్ జాకీ)స్నేక్ తాను నటించిన ‘మెజెంటా రెడ్డిమ్’ సాంగ్‌కు డ్యాన్స్ చేయాలని తమన్నాను ఛాలెంజ్ చేశాడు. డీజే స్నేక్ ఛాలెంజ్‌ను స్వీకరించిన తమన్నా..మెజెంటా రెడ్డిమ్ పాటకు వెస్టర్న్ కమ్ ఇండియన్‌ ైస్టెల్ లో స్టెప్పులు వేసి అదరగొట్టేసింది. తన డ్యాన్స్ వీడియోను సోషల్‌మీడియా ద్వారా షేర్ చేసింది. ఈ పాటకు జూయివైద్య కొరియోగ్రాఫర్‌గా పనిచేసినట్లు తెలిపింది తమన్నా. తమన్నా డ్యాన్స్ వీడియోను లక్షమందికిపైగా లైక్ చేశారు. డీజే స్నేక్ నటించిన ‘మెజెంటా రెడ్డిమ్’ సాంగ్ ఇండియాలో చాలా పాపులర్ అయింది. ఈ పాటలో నటించినవారు భారతీయులే కావడం విశేషం. డీజే స్నేక్ సాంగ్, తమన్నా షేర్ చేసిన డ్యాన్స్ వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి.


2588
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles