జ‌య‌ప్ర‌ద పాత్ర‌లో మిల్కీ బ్యూటీ ..!

Thu,October 11, 2018 10:23 AM
Tamannah plays a role of Jayaprada

టాలీవుడ్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కుతున్న బ‌యోపిక్స్‌లో ఎన్టీఆర్ ఒక‌టి. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుద‌ల కానుంది. తొలి భాగం క‌థానాయ‌కుడు పేరుతో జ‌న‌వరి 9న విడుద‌ల కానుండ‌గా, రెండో భాగం మ‌హానాయ‌కుడు పేరుతో జ‌న‌వ‌రి 24న రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పాత్ర‌లు ప్రేక్ష‌కులలో సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. రీసెంట్‌గా శ్రీదేవి పాత్ర‌లో న‌టిస్తున్న ర‌కుల్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసి ఫ్యాన్స్‌ని అల‌రించింది చిత్ర బృందం. అయితే ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో జ‌య‌ప్ర‌ద‌కి కూడా ప్ర‌త్యేక స్థానం ఉంది. ఇప్పుడు ఆమె పాత్ర కోసం మిల్కీ బ్యూటీ తమ‌న్నాని ఎంపిక చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ - జ‌య‌ప్ర‌ద కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘సూపర్‌మ్యాన్’, ‘అడవి రాముడు’, ‘చాణక్య చంద్రగుప్తా’, ‘యమగోల’ చిత్రాలు భారీ విజ‌యం సాధించాయి. ఈ క్ర‌మంలో ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో జ‌య‌ప్ర‌ద పాత్ర‌ని చేర్చాల‌ని టీం భావించ‌గా త‌మ‌న్నా ఆ పాత్రకి స‌రిపోతుంద‌ని అనుకుంటున్నార‌ట‌. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. త‌మ్మూ ప్ర‌స్తుతం ఎఫ్ 2 అనే మ‌ల్టీ స్టార‌ర్ లో వెంకీ స‌ర‌స‌న న‌టిస్తుంది . దీంతో పాటు కునాల్ కోహ్లి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమాతో పాటు చిరంజీవి సైరా, హిందీలో ఖామోషి, త‌మిళ్‌లో క‌న్నె క‌లైమాని అనే సినిమాలు చేస్తుంది. రీసెంట్‌గా ద‌టీజ్ మ‌హాల‌క్ష్మీ అనే సినిమా చిత్రీక‌ర‌ణకి గుడ్ బై చెప్పింది ఈ మిల్కీ బ్యూటీ.

2323
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles