పెళ్లి చూపులు రీమేక్‌లో తమన్నా !

Fri,January 6, 2017 05:28 PM
Tamannaah to act in Pellichooplu Tamil remake


హైదరాబాద్: విజయ్‌దేవరకొండ, రీతూ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ‘పెళ్లిచూపులు’ మూవీ బాక్సాపీస్ వద్ద సూపర్‌హిట్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాను డైరెక్టర్ సెంథిల్ వీర సామి తమిళ్‌లో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పెళ్లి చూపులు రీమేక్‌లో టాలీవుడ్ హీరోయిన్ తమన్నాను ఎంపిక చేసినట్లు సెంథిల్ వెల్లడించాడు. రీమేక్‌లో నటించే విషయమై ఇటీవలే తమన్నాను సంప్రదించగా..ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సెంథిల్ తెలిపాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ నిర్మించనున్న ఈ మూవీని వచ్చే ఏడాది సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్లు సమాచారం. పెళ్లి చూపులు మూవీకి తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వం వహించారు.

1987
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS