బూటు విసిరిన సంఘ‌ట‌న‌పై స్పందించిన త‌మ‌న్నా

Sat,February 10, 2018 09:33 AM
tamannaah open up on shoe incident

మిల్కీ బ్యూటీ త‌మన్నా ప్ర‌స్తుతం క్వీన్ రీమేక్‌తో పాటు క‌ళ్యాణ్ రామ్ ప్ర‌ధాన ప్రాత్ర‌లో తెర‌కెక్కుతున్న నా నువ్వే చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే జనవరి 28న ఓ నగల దుకాణ ప్రారంభోత్సవానికి వెళ్ళిన త‌మ‌న్నాపై క‌రీముల్లా అనే వ్య‌క్తి బూటు విసిరాడు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది అత‌ని ప‌ట్టుకొని విచారించ‌గా, త‌మ్మూ ఎక్కువ‌గా సినిమాలు చేయ‌క‌పోవ‌డం వ‌ల‌నే అలా చేశానంటూ అత‌ను చెప్పుకొచ్చాడు. ఆ స‌మయంలో ఈ విష‌యంపై స్పందించ‌ని త‌మన్నా రీసెంట్‌గా ఓపెన్ అయింది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తారు. వాళ్లనెవరూ ఆపలేరు .నా విషయంలోనూ అదే జరిగిందని చెప్పుకొచ్చింది త‌మ‌న్నా . ‘కథానాయికలకు స్వాగతం చెప్పడానికి కొంత మంది పూలవర్షం కురిపిస్తారు. అలాంటప్పుడు మేం ఏమీ మాట్లాడం. అదే సమయంలో కొంత మంది బూట్లు విసరవచ్చు. ఏం చేయగలుగుతాం’ అని తమన్నా అంది. కొందరు ఓ గిరి గీసుకుని అందులోనే ఉండిపోతారు. బయట ప్రపంచం గురించి అస్సలు పట్టించుకోరు. మనమేదైనా చేస్తే పక్క వాళ్లేమనుకుంటారు.. వాళ్లకేమైనా ఇబ్బంది కలుగుతుందా? అనే విషయాలేవీ అలాంటి వ్యక్తులకు పట్టవు’ అని తమన్నా అంది.

2025
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles