తెలుగులో తగ్గిన తమన్నా జోరు

Thu,November 24, 2016 09:38 AM
Tamannaah concentrated in malayalam

సాధారణంగా హీరోయిన్స్ కు ఒక్కో సీజన్ ఉంటుంది. ఆ సీజన్ లో వాళ్లకు చాలా సినిమాలు ఉంటాయి. తర్వాత ఎందుకో ఒక్కసారిగా డౌనై పోతారు. ఆఫర్స్ తగ్గుతాయి. ఇలాంటి నేపథ్యంలో పరభాషా సినిమాలపై ఆధారపడుతుంటారు. మిల్కీ బ్యూటీ తమన్నా కొన్నాళ్ళు తమన్నా తెలుగులో బాగా బిజీయింది. మిల్కీ బ్యూటీ అంటే ఆడియన్స్ కు యమ క్రేజ్ ఉండేది . స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసి పలు హిట్లు కూడా ఇచ్చింది. ఈ ఏడాది తెలుగులో అవంతిక నటించిన సినిమాలు నాలుగు విడుదలయ్యాయి. మిగతా హీరోయిన్స్ తో పోలిస్తే ఎక్కువే అని చెప్పాలి. స్పీడున్నోడు, ఊపిరి, జాగ్వర్,అభినేత్రి చేసింది తమన్నా. వీటిలో స్పీడున్నోడు తప్ప మిగతా మూడూ రెండు మూడు భాషల్లో తీసిన సినిమాలు.

తమన్నా నటించిన అభినేత్రి, జాగ్వర్ సినిమాలు లేటెస్ట్ గా రిలీజయ్యాయి. ఈ ఏడాది వచ్చిన ఊపిరి తమ్మూకు మంచిపేరు తెచ్చింది. తమ్మూ ఇప్పుడు బాహుబలి 2 లో చేస్తోంది. ఈ సినిమా తర్వాత మిల్కీ బ్యూటీకి తెలుగులో సినిమాలు లేవనే చెప్పాలి. అభినేత్రిలో తమన్నా మంచి కేరక్టర్ చేసినా ఆ సినిమా అంచనాకు తగ్గట్టు ఆడలేదు. తెలుగులో తమ్మూకు ప్రస్తుతం కొత్త సినిమాలేవీ లేవు. టాలీవుడ్ లో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ ఆమెకు గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే తమిళంలో మాత్రం స్టార్ హీరోలతో చేస్తూ మాంఛి జోరుమీద ఉంది తమన్నా. అక్కడ శింబు, విశాల్ లతో పిక్చర్స్ చేస్తోంది. తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నందువల్లే తమన్నా తెలుగులో కొత్త సినిమాలు అంగీకరించడం లేదని అంటున్నారు.

2098
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles