వాన పాటలో మరోసారి రచ్చ చేయనున్న మిల్కీ భామ

Thu,October 12, 2017 10:34 AM
TAMANNAAH BHATIA rain song so crazy

సినిమాలో వానపాట అంటే ఆడియన్స్ కు అదో గిలిగింత, కుర్రకారుకి మదిని దోచే పులకింత. వానలో తడుస్తూ హీరోహీరోయిన్స్ సినిమాలో పాడుకుంటుంటే ... చూసే అమ్మాయిలు, అబ్బాయిలు తమ బాయ్ ఫ్రెండ్ ను, గాళ్ ఫ్రెండ్ ను ఇమేజిన్ చేసుకుంటూ డ్రీమ్స్ లోకి వెళ్లిపోతుంటారు. రెయిన్ సాంగ్ కు అంత పవరుంది మరి. ఆ రోజుల్లో ఆత్మబలం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, బి. సరోజాదేవి వానలో తడుస్తూ – చిటపట చినుకులు పడుతూ ఉంటే ... అనే పాడుతుంటే ప్రేక్షకులకు జివ్వుమనిపించింది. బహుశ అదే మొదటి రెయిన్ సాంగ్ కావచ్చు. అప్పటి నుంచీ ఛాన్స్ దొరికినప్పుడల్లా సినిమాల్లో వానపాటలు చేరుస్తూనే ఉన్నారు మూవీ మేకర్స్.

ఇక ఇప్పటి విషయానికి వస్తే మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి కుర్రాళ్లకు కునుకులేకుండా చేసేందుకు రెడీ అవుతోంది. బాహుబలి ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్, తమన్నా పాటను ఎవరు మరిచిపోగలరు చెప్పండి. తెలిమంచు తెరల్లో తేలియాడుతూ – జలపాతాల సవ్వడుల మధ్య పులకిస్తూ, ప్రకృతి ఒడిలో పరవశిస్తూ డార్లింగ్ తో కలిసి మిల్కీబ్యూటీ పాడిన ఆ పాట –అబ్బో ! మనసులకు ఎంతగా హత్తుకు పోయిందో కదా. ఆ జోరు, హుషారును మాటల్లో చెప్పలేం మరి. మరోసారి ఆ సోయగాలను సొగసుల్ని చూపించి, ప్రేక్షకుల్ని తన్మయుల్ని చేయడానికి తమ్మూ బేబీ రెడీ అవుతోంది.

తమన్నా ప్రస్తుతం ఎంఎల్ ఏ చిత్రంలో కల్యాణ్ రామ్ జోడీగా నటిస్తోంది. జయేంద్ర దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ స్పీడ్ గా సాగుతోంది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ .. తమన్నాలపై ఒక వాన పాట ఉందట. ఈ పాటలో తమన్నా హై రేంజ్ లోనే అందాలు ఆరబోసిందని అంటున్నారు. తమన్నా గతంలో 'బద్రీనాథ్' .. 'రచ్చ' సినిమాల్లో వానపాటతో అందరు తడిసిముద్దయ్యేలా చేసింది.

2122
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS