‘క్వీన్’ తమిళ్ రీమేక్‌లో తమన్నా..

Wed,November 30, 2016 10:30 PM
Tamannaah Bhatia is the New Queen.


ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ లీడ్ రోల్‌లో నటించిన క్వీన్ చిత్రం బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. క్వీన్ తో కంగనా జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకుని.. తన ఇమేజ్‌ను అమాంతం పెంచేసుకుంది. సూపర్ హిట్ ‘క్వీన్’ మూవీ తమిళ్ రీమేక్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుంది.

ఈ విషయాన్ని తమన్నా వెల్లడించింది. క్వీన్ రీమేక్‌లో నటించేందుకు సైన్ చేశా. ప్రస్తుతం డేట్స్ కోసం ఎదురుచూస్తున్నా. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించింది తమన్నా. ఈ మూవీలో తమన్నా స్నేహితురాలి పాత్రలో కోలీవుడ్ బ్యూటీ అమీ జాక్సన్ నటించనుంది.

1454
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles