టాంగో డాన్స్ నేర్చుకున్న మిల్కీ బ్యూటీ..!

Sun,January 21, 2018 04:28 PM
tamanna learned tango dance

కెరీర్‌లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించిన త‌మ‌న్నా బాహుబ‌లి సినిమా త‌ర్వాత కాస్త స్లో అయింది. ప్ర‌స్తుతం త‌న చేతిలో నా నువ్వే అనే మూవీతో పాటు తెలుగు క్వీన్ రీమేక్ ఉంది. నా నువ్వే అనే చిత్రం క‌ళ్యాణ్ రామ్ హీరోగా తెర‌కెక్కుతుండ‌గా, ఈ మూవీలో క‌థానాయిక‌గా త‌మ్మూ న‌టిస్తుంది. ఇందులో త‌మ‌న్నా అతి క‌ష్ట‌మైన టాంగో డాన్స్ చేస్తుంద‌ట‌. టాంగో డ్యాన్స్ నేర్చుకునేందుకు త‌మ‌న్నా చాలా హార్డ్ వ‌ర్క్ చేసింద‌ట‌. రిహార్స‌ల్ టైంలో చాలా దెబ్బ‌లు కూడా తింద‌ట‌. విన‌డానికి సుల‌భంగా అనిపించే టాంగో డాన్స్ చేయ‌డం చాలా క‌ష్ట‌మంటుంది. ఈ చిత్రంలో త‌మ‌న్నా రేడియో జాకీగా నటిస్తోంది. సిద్దార్థ్ తో 180 లాంటి సెన్సిబుల్ లవ్ స్టొరీ తీసి అందరిని మెప్పించిన దర్శకుడు జయేంద్ర నా నువ్వేకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మ‌రి త‌మ‌న్నా టాంగో డాన్స్ ఎలా ఉంటుందో చూడాలి అంటే మూవీ రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే.

1966
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles