విజ‌యనిర్మ‌ల‌ని స‌న్మానించిన త‌ల‌సాని

Fri,May 26, 2017 06:23 PM
talasani srinivas yadav felicitate vijaya nirmala

సీనియ‌ర్ న‌టి, ద‌ర్శ‌కురాలు విజ‌య‌నిర్మ‌ల‌కి యూకేకి చెందిన రాయల్ అకాడ‌మీ ఆఫ్ గ్లోబ‌ల్ పీస్ సంస్థ గౌర‌వ డాక్ట‌రేట్ ప్ర‌ధానం చేసింది. కృష్ణ నివాసంలో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి హాజ‌రైన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ విజ‌య‌నిర్మ‌ల‌ని గౌర‌వ డాక్ట‌రేట్ తో స‌త్క‌రించారు. మూవీ ఆర్టిస్ట్ అసోషియేష‌న్ స‌భ్యులు కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రై విజ‌య నిర్మల‌కి అభినంద‌న‌లు తెలిపారు. ప‌ద్మ భూషణ్ పుర‌స్కారానికి కూడా విజ‌య నిర్మ‌ల పేరుని కేంద్రానికి సిఫార‌సు చేయ‌నున్న‌ట్టు మంత్రి త‌ల‌సాని వెల్ల‌డించారు. దాదాపు 200 సినిమాల‌లో న‌టించిన విజ‌య నిర్మ‌ల 47 చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. చిత్ర ప‌రిశ్ర‌మలో ఆమె చేసిన సేవ‌ల‌కు గాను గిన్నీస్ బుక్ లోను చోటు సంపాదించుకుంది ఈ సీనియ‌ర్ న‌టి. అయితే కృష్ణ గారి ప‌క్క‌న కూర్చొని గౌర‌వ డాక్టరేట్ అందుకోవ‌డం త‌న‌కి చాలా సంతృప్తిని ఇచ్చింద‌ని విజ‌య‌నిర్మల వెల్ల‌డించారు.

1300
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles