ఎన్టీఆర్,ప్ర‌భాస్‌, త్రివిక్ర‌మ్‌ల‌కి త‌ల‌సాని ఛాలెంజ్‌

Fri,August 10, 2018 12:38 PM
talasani green challenge to ntr and prabhas

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం నాలుగో విడత కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ పేరుతో రాజకీయ, సినీ ప్రముఖులు మొక్కలు నాటుతున్నారు. తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా మూడు మొక్క‌లు నాటి హ‌రిత స‌వాల్‌ని ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, నిర్మాత దిల్ రాజు, టీటీడి ఛైర్మ‌న్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌ల‌కి స‌వాల్ విసిరారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ విసిరిన హరిత ఛాలెంజ్‌లో భాగంగా తలసాని ఛాలెంజ్‌ని స్వీకరించి పూర్తిచేశారు. మ‌నుషుల మ‌నుగ‌డ కోసం ప్ర‌తి ఒక్క‌రు చెట్లు నాటాలి. హరితహారం పేరుతో సీఎం చంద్రశేఖర రావు గారి ఆధ్వర్యంలో తెలంగాణవ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటాం. భవిష్యత్తు తరాలకు ఆక్సిజన్ అందించే బాధ్య‌త మ‌న‌మీదే ఉంది. ఇందుకోసం ప్ర‌తి ఒక్క‌రు మొక్క‌లు నాటాల‌ని తల‌సాని పిలుపునిచ్చారు.

2839
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS