రానా చిత్రం నుండి త‌ప్పుకున్న ట‌బు..!

Fri,August 9, 2019 10:26 AM

ఒక‌ప్ప‌టి హిట్ హీరోయిన్ ట‌బు ప్ర‌స్తుతం సపోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో న‌టిస్తుంది. ఇటీవ‌ల అల్లు అర్జున్ 19వ చిత్ర షూటింగ్‌లో ట‌బు పాల్గొన‌గా, ఆమెకి సంబంధించిన వీడియోని టీం రిలీజ్ చేసింది. ఇక రానా, సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న విరాట ప‌ర్వం 1992లోను ట‌బు కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని చెప్పుకొచ్చారు. కాని తాజా స‌మాచారం ప్ర‌కారం ఆమె ఆ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంద‌ని అంటున్నారు. విరాట‌ప‌ర్వం చిత్ర షూటింగ్ మ‌రింత డిలే అవుతుండ‌డంతో ట‌బు త‌న డేట్స్ అడ్జెస్ట్ చేయ‌లేక‌పోతుంద‌ట‌. బాలీవుడ్ చిత్రానికి కూడా ట‌బు కాల్షీట్స్ ఇవ్వ‌డంతో రెండు క్లాష్ అవుతున్నాయ‌ని బీటౌన్ టాక్. ఈ నేప‌థ్యంలోనే ట‌బు విరాట‌ప‌ర్వం నుండి త‌ప్పుకుంద‌ని చెబుతున్నారు. ఆమె స్థానంలో నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట‌ర్ , బాలీవుడ్ న‌టి నందిత శ్వేత‌ని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. వేణు ఉడుగ‌ల ద‌ర్శ‌క‌త్వంలో విరాట ప‌ర్వం రూపొంద‌నుండ‌గా, ఈ చిత్రాన్ని సుధాక‌ర్ చెరుకూరి, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియ‌మ‌ణి, ఈశ్వ‌రీరావు, సాయి చంద్, జ‌రీనా వ‌హ‌బ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. బాలీవుడ్ న‌టుడు నానా ప‌టేక‌ర్ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌

1152
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles