సైరా చిత్రంలో అల‌నాటి అందాల న‌టి.. !

Fri,August 31, 2018 11:08 AM
tabu played key role in syeraa

హీరోలైనా, హీరోయిన్స్ అయినా సీనియర్స్ సీనియర్సే. వాళ్ల సీనియారిటీ ఎప్పటికీ కౌంట్ అవుతుంది. ఏ మూవీలో నటించిన వారు ఆ సినిమాకు ప్లస్ అవుతారు. ఒకప్పుడు హిట్ హీరోయిన్ గా పేరున్న రమ్యకృష్ణ, మీనా వంటి తారలు ఇప్పుడు కేరక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ అదరహో అనిపిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో తార చేరబోతోంది. ఆమె మరెవరో కాదు టబు. ఈమె అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుత‌న్న సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుంద‌ట‌.

టబును అప్పట్లో బాలీవుడ్ నటి అన్నారంతా. కానీ టాలీవుడ్ లో కూడా చేసి, నేను ఏ లాంగ్వేజ్ లో అయినా హిట్ అవుతాను అని ప్రూవ్ చేసుకుంది. ఆనాటి టబూ ఫిట్ నెస్ నేటికీ తగ్గలేదు. ఆమె ఇప్పటికీ తళుకులీనుతూనే ఉంది. సైరా చిత్రంలో కీల‌క పాత్ర కోసం ట‌బుని చిత్ర యూనిట్ సంప్ర‌దించ‌గా, వెంటనే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ట‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. భారీ కాస్టింగ్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి, న‌య‌న‌తార‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, కిచ్చా సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి, త‌మ‌న్నా ముఖ్య పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రామ్ చ‌ర‌ణ్ నిర్మాణంలో రూపొందుతుంది. అమిత్ త్రివేది చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

5194
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles