మ‌హిళా క్రికెట‌ర్ బ‌యోపిక్‌లో తాప్సీ..!

Wed,November 20, 2019 09:03 AM

ప్రపంచ మహిళా క్రికెట్‌లోనే అత్యధిక పరుగులు చేసిన క్రికెట‌ర్ మిథాలీ రాజ్‌.. సుదీర్ఘకాలం ఇండియాకు ప్రాతినిథ్యం వహించిన మిథాలీ ఇటీవ‌ల టీ 20ల‌కి గుడ్ బై చెప్పింది. 2018లో ఆమె జట్టు తరఫున కీలకంగా వ్యవహరించారు.ఇప్పుడు ఆమె జీవితాన్ని వెండితెరపైకి తీసుకొచ్చేందుకు వ‌యాకామ్ 18 సంస్థ ప్ర‌య‌త్నాలు చేస్తుంది. అయితే మిథాలీ పాత్ర‌లో ఏ న‌టిని ఎంపిక చేయాల‌నే దానిపై నిర్మాణ సంస్థ కొన్నాళ్ళుగా చ‌ర్చ‌లు జ‌రుపుతుంది. విభిన్న పాత్ర‌లు పోషిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న తాప్సీ.. మిథాలీ పాత్ర‌కి స‌రిగ్గా స‌రిపోతుంద‌నే ఆలోచ‌న కూడా చేస్తుంద‌ట వ‌యాకామ్ 18 సంస్థ‌. అతి త్వ‌ర‌లోనే చిత్ర ద‌ర్శ‌కుడితో పాటు, చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించేది ఎవ‌రు అనే దానిపై క్లారిటీ ఇవ్వ‌నున్నారు మేక‌ర్స్‌. తాప్సీ చివ‌రిగా శాండ్ కీ ఆంఖ్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇందులో 70 ఏళ్ళ వ‌య‌స్సున్న వృద్దురాలిగా క‌నిపించి అల‌రించింది.

944
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles