ఫోర్స్, సిక్స‌ర్స్ కొట్టేందుకు సిద్ద‌మైన తాప్సీ

Wed,August 1, 2018 11:37 AM
Taapsee Pannu palys role of mithali raj

ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్స్ హ‌వా ఎక్కువ‌గా నడుస్తుంది. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల జీవితాల‌కి సంబంధించిన సినిమాలేకాక స్టోర్ట్స్ ప‌ర్స‌నాలిటీస్ బ‌యోపిక్స్ కూడా తెర‌కెక్కుతున్న విష‌యం విదిత‌మే. ముఖ్యంగా క్రీడారంగానికి చెందిన బ‌యోపిక్స్‌పై అభిమానులు ఎక్కువ‌గా ఆసక్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలో పుల్లెల గోపిచంద్‌, సైనా నెహ్వాల్‌, సానియా మీర్జా, పీవీ సింధుల బ‌యోపిక్స్ ప్లానింగ్ ద‌శ‌లో ఉన్నాయి. త్వ‌ర‌లో భార‌త మ‌హిళ క్రికెట‌ర్ మిథాలీ రాజ్ జీవిత నేప‌థ్యంలోను ఓ సినిమాని నిర్మించాల‌ని ప్లాన్ చేసింది బాలీవుడ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ వ‌యాకామ్ 18. ఇటీవ‌ల మిథాలీని క‌లిసిన వారు మిథాలి జీవితంలోని ముఖ్య‌మైన అంశాల‌ని తీసుకొని స్క్రిప్ట్ గా రూపొందిస్తున్నార‌ట‌.

మిథాలీ రాజ్ భార‌త్ క్రికెట్ కెప్టెన్‌గా ఉండ‌డంతో పాటు ఒంటి చేత్తో ఎన్నో విజ‌యాల‌ని అందించింది. ఆమె జీవిత నేప‌థ్యంలో రూపొంద‌నున్న చిత్రం భారీ విజ‌యం సాధిస్తుంద‌ని నిర్మాత‌లు భావించ‌గా, మిథాలీ పాత్ర కోసం ఎవ‌రిని ఎంపిక చేయాలా అనే ఆలోచ‌న‌లో వారు ఉన్నారు. మిథాలీ రాజ్ పాత్ర కోసం తాప్సీ అయితే బాగుంటుంద‌ని అభిమానులు భావించ‌గా, ముల్క్ సినిమా ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్న తాప్సీని ఇదే అంశంపై మీడియా ప్ర‌శ్నించింది. దీనికి బ‌దులిచ్చిన తాప్సీ.. మిథాలీ పాత్ర‌లో న‌న్ను చేయ‌మ‌ని నిర్మాత‌లు అడిగితే చాలా హ్యాపీగా ఫీలవుతాను. ఎప్ప‌టి నుండో స్పోర్ట్స్ బ‌యోపిక్ చేయాల‌నుంద‌ని త‌న మ‌నసులో మాట‌ల‌ని బ‌య‌ట‌పెట్టింది తాప్సీ. మ‌రి ఎలాంటి పాత్ర‌ల‌లోనైన ఇమిడి పోయే తాప్సీ గ్రౌండ్‌లోకి దిగి ఫోర్స్, సిక్స‌ర్స్ కొడుతుంటే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి.

1030
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS