ప్రేమ‌లో ఉన్న విష‌యాన్ని ఒప్పుకున్న తాప్సీ

Wed,September 11, 2019 01:40 PM

2010లో వ‌చ్చిన ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మైన అందాల భామ తాప్సీ. ఈ సినిమా త‌ర్వాత మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌, వీరా, మొగుడు వంటి చిత్రాల‌లో న‌టించిన‌ప్ప‌టికి ఈ అమ్మ‌డికి పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో బాలీవుడ్ చెక్కేసింది. హిందీలో మంచి క‌థాంశం ఉన్న చిత్రాల‌ని ఎంపిక చేసుకుంటూ స్టార్ స్టేట‌స్ అందుకుంది. అయితే కొన్నాళ్ళుగా తాప్సీ ప్రేమాయ‌ణంకి సంబంధించి ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది తాప్సీ.


తాప్సీ త‌న సోదరి షగున్‌తో కలిసి ఓ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తాను ఓ వ్య‌క్తితో ప్రేమ‌లో ఉన్న‌ట్టు పేర్కొంది. అయితే తాను ప్రేమించే వ్యక్తి న‌టుడు, క్రికెట‌ర్ కానే కాదు. అస‌లు భారతీయుడే కాదు అని చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చింది. నా వ‌ల‌న‌నే తాప్సీకి ప్రియుడు దొరికాడు. అందుకు తాప్సీ కృత‌జ్ఞ‌తలు తెల‌పాలి. ఆ వ్య‌క్తి చాలా విచిత్ర‌మైన మ‌నిషి. అత‌న‌ని ఎలా ఇష్ట‌ప‌డిందే అర్ధం కావ‌డం లేదు అంటూ సర‌దాగా పేర్కొంది తాప్సీ సోద‌రి ష‌గున్.

తాప్సీ చెబుతున్న వ్య‌క్తి డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోనా అని అంద‌రు ఆలోచ‌న చేస్తున్నారు. ‘ఎందరో కప్పల్లాంటి వ్యక్తులను ముద్దుపెట్టుకున్న తర్వాతే నాకు నా రాజకుమారుడు దొరికాడు’ అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది తాప్సీ. అయితే ‘నాకు పిల్లలు కావాలి అనుకున్నప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి కాకుండా మాత్రం పిల్లల్ని కనను. అలాగని నా పెళ్లి ఆడంబరాలతో ఉండకూడదు. కుటుంబ స‌భ్యులు, స్నేహితుల మ‌ధ్య స‌ర‌దాగా జ‌ర‌గాలి అని ఆమె స్ప‌ష్టం చేసింది.

2165
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles