తాప్సీ.. ఆ బికినీ ఏంటి ?

Thu,September 14, 2017 01:14 PM
taapse strong punches to netigens

ఝుమ్మంది నాదం చిత్రంతో వెండితెర‌కి ఎంట్రీ ఇచ్చిన తాప్సీ ప్ర‌స్తుతం బాలీవుడ్ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. తాజాగా డేవిడ్ దావ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో జుడ్వా చిత్రాన్ని చేయ‌గా ఈ మూవీ సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల కానుంది. వ‌రుణ్ ధావ‌న్‌, జాక్వ‌లైన్ ఫెర్నాండేజ్ కూడా ఇందులో ముఖ్య పాత్ర‌లు పోషించారు. సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో చిత్ర యూనిట్ మూవీ సాంగ్స్ విడుద‌ల చేస్తూ భారీ ప్ర‌మోష‌న్స్ చేసుకుంటుంది. ఈ క్ర‌మంలో ఆతో స‌హీ సాంగ్‌ని విడుద‌ల చేశారు. దీనిని ట్యాగ్ చేస్తూ తాను ఆ పాట‌లో వేసుకున్న బికినీస్టిల్స్ ని ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది తాప్సీ. అంతే ఇక ట్విట్ట‌ర్‌లో తాప్సీపై నెటిజ‌న్స్ ఫైర్ మొదలైంది.

తాప్సీ బికినీ ధ‌రించ‌డంపై కొంద‌రు నెటిజ‌న్స్ దుర్భాష‌లాడారు. నోటికి వచ్చిన‌ట్టు తిట్ల పురాణం చ‌దివారు. ఈ క్ర‌మంలో ఓ నెటిజన్ ..నువ్వు ఏం బ‌ట్ట‌లు వేసుకుంటున్నావ్‌, ప‌రువు తీస్తున్నావ్‌! నీ సోద‌రుడు చూసి, ఎంత ప్రౌడ్‌గా ఫీల‌వుతున్నాడో అని తాప్సీ పోస్ట్‌కి కామెంట్ పెట్టాడు. దీనికి వెంట‌నే స్పందించిన తాప్సీ .. సారీ భాయ్, నాకు సోద‌రుడు లేడు. లేదంటే పక్కాగా అడిగి చెప్పేదాన్ని. ఇప్ప‌టికి ఈ సోద‌రి ఇచ్చిన ఆన్స‌ర్ స‌రిపోతుంది క‌దా.. అని తాప్సీ చాలా ఇంటిలిజెంట్ కౌంట‌ర్ ఇచ్చింది. ఇక మ‌రొక నెటిజ‌న్ చెత్త సినిమాలు చేసి, దేశ యువ‌త‌ని నాశ‌నం చేస్తున్నారు. క‌నీసం సోష‌ల్ మీడియాలో అయిన అశ్లీల ఫోటోలు పోస్ట్ చేయ‌కు అని కామెంట్ పెట్టాడు.

నెటిజ‌న్ కామెంట్‌కి బ‌దులుగా తాప్సీ.. చెత్త‌నా..! అది నా ఒంటికి అంటిన ఇసుక‌, శుభ్రం చేసుకోవాలి..నెక్ట్స్ టైమ్ జాగ్ర‌త్తలు తీసుకుంటా, క్ష‌మించండి అంటూ తాప్సీ కౌంట‌ర్ ఇచ్చింది. ఇలా అటు నెటిజన్స్ ఇటు తాప్సీల మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్ చాలా ఆస‌క్తిక‌రంగా న‌డుస్తుంది. మరి ఈ ట్విట్ట‌ర్ రచ్చ సినిమాకి ఏమైన ప్ల‌స్ అవుతుందా, లేదా అనేది ఈ అమ్మ‌డికే తెలియాలి. గ‌తంలో తాప్సీ రాఘ‌వేంద్ర‌రావుపై సంచ‌లన కామెంట్స్ చేసి, ఆ త‌ర్వాత చాలా తెలివిగా ఆ వివాదం నుండి త‌ప్పించుకున్న సంగ‌తి తెలిసిందే.
3156
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS