బాహుబ‌లి క‌న్నా గొప్ప స్థాయిలో..

Thu,August 31, 2017 04:55 PM
Taanaji movie more interesting film than baahubali

అదివరకు మనం వేరే భాషా చిత్రాలవైపు చూసేవాళ్లం. పొరుగింటి పుల్లకూర సామెతను నిరూపించాం. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ మారింది. బాలీవుడ్ సైతం మనవైపు చూస్తోంది. అంతేకాదు .. మన ద్వారా ఒక స్ఫూర్తిని పొందిందనిపిస్తోంది. అందరినీ అంతగా ఇన్ స్పైర్ చేసింది బాహుబలి. ఇది నిజంగా మనకు ఒకవిధంగా గర్వకారణమే. అయితే బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గణ్ మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ సైన్యంలో సేనాధిపతిగా ఉన్న సుబేదార్ తానాజీ మలుసరే జీవితం ఆధారంగా ‘తానాజీ : ది అన్ సంగ్ వారియర్’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు . ఓమ్ రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్న అజ‌య్ దేవ‌గణ్‌ ఈ సినిమాను ‘బాహుబలి’ కన్నా గొప్ప స్థాయిలో చేయాల‌ని అనుకుంటున్నామే తప్ప‌ బాహుబ‌లికి పోటీగా తీయాలని అనుకోవ‌డం లేద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపాడు. మనం తీసే చిత్రాల్లో భావోద్వేగాలు, నాటకీయత మొదలైనవి ఎక్కువగా ఉండాలని అన్నారు. అలా తీయలేని పక్షంలో మన సినిమాలను హాలీవుడ్ సినిమాలు భర్తీ చేస్తాయని వ్యాఖ్యానించాడు అజయ్.

4317
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles