చిరు బ‌ర్త్‌డే గిఫ్ట్‌గా 'సైరా' టీజ‌ర్ విడుద‌ల‌

Tue,August 21, 2018 11:32 AM
Syeraa teaser released

మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియ‌ర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న చిత్రం సైరా. భార‌త మాత‌కు బిగుసుకున్న సంకెళ్ళ‌ని తెంచ‌డానికి రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మించిన వ్య‌క్తి ఉయ్యాల వాడ న‌ర‌సింహ‌రెడ్డి. ఆ నాటి రోజుల‌లో బ్రిటీష్ సైనికుల‌తో అర్ధ‌రాత్రి, అప‌రాత్రి అనే తేడా లేకుండా యుద్ధం చేశాడు. ఇప్పుడు ఆయన జీవిత నేప‌థ్యంలో చిరు 151వ చిత్రంగా సురేంద‌ర్ రెడ్డి సైరా అనే మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. కొత్తగా వేసిన‌ సెట్‌లో ఈ మూవీ షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ షెడ్యూల్ త‌ర్వాత యూర‌ప్‌కి వెళ్ళ‌నుంది చిత్ర బృందం.

వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్న సైరా చిత్రంలో న‌య‌న‌తార‌, చిరంజీవి, అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తిబాబు , సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్నాడు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బేన‌ర్‌పై రామ్ చ‌ర‌ణ్ సైరా చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా యాక్షన్‌ సీన్స్ కోసం స్కైఫాల్‌, హ్యారీ పొట‌ర్‌ల‌కి ప‌ని చేసిన హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్లు ప‌ని చేస్తున్నారు. రేపు (ఆగ‌స్ట్ 22న‌) చిరంజీవి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అభిమానుల‌కి టీజ‌ర్‌తో స్ట‌న్నింగ్ గిఫ్ట్ ఇచ్చాడు మెగాస్టార్‌. చిరు త‌ల్లి అంజ‌న‌మ్మ ఈ టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్ అభిమానుల రోమాలు నిక్క పొడుచుకునేలా చేస్తుంది. అమిత్ త్రివేది బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌, ర‌త్న‌వేలు సినిమాటోగ్రఫీ, ఫైటింగ్ సన్నివేశాలు అభిమానులు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల విడుద‌లైన ఫోటోలు సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాయి. తాజాగా విడుద‌లైన టీజ‌ర్ మీరు చూసి ఎంజాయ్ చేయండి.

2367
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles