టాలీవుడ్ హిస్టరీలో టాప్ ప్లేస్ ద‌క్కించుకున్న సైరా టీజ‌ర్

Wed,August 22, 2018 12:42 PM
syeraa teaser gets most views in tollywood

సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి 151వ చిత్రంగా తెర‌కెక్కుతున్న చిత్రం సైరా. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్ర టీజ‌ర్ చిరు పుట్టిన రోజు శుభాకాంక్ష‌ల‌తో నిన్న ఉద‌యం విడుద‌లైంది. అన్ని డిజిటల్ ప్లాట్‌ ఫామ్స్‌లో కలిపి ఈ టీజర్‌ 24 గంటల్లో 12 మిలియన్ల(కోటి ఇరవై లక్షల) వ్యూస్‌ సాధించినట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో ఏ చిత్ర టీజ‌ర్‌కి ఈ రేంజ్‌లో వ్యూస్ రాలేద‌ని అంటున్నారు. సైరా చిత్రం చిరు కెరీర్‌లో తెర‌కెక్కుతున్న తొలి చారిత్రాత్మ‌క చిత్రం కావ‌డంతో ఈ మూవీపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్, న‌య‌న‌తార‌, సుదీప్ , విజ‌య్ సేతుప‌తి వంటి ప‌లువురు స్టార్స్ ఇందులో భాగం కావ‌డం అభిమానుల‌లో ఆసక్తిని క‌లిగిస్తుంది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం త్వ‌ర‌లో యూర‌ప్ షెడ్యూల్ జ‌రుపుకోనుంది. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ కానుక‌గా ఈ మూవీ థియేట‌ర్స్‌లోకి రానుంది.

3690
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles