20 రోజుల పాటు చైనాలో బిజీగా బిజీగా మెగాస్టార్ చిరంజీవి

Sat,March 23, 2019 09:37 AM
Syeraa team moves to china

స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రెడ్డి జీవిత నేప‌థ్యంలో సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న చిత్రం సైరా. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్ శివార్ల‌లో వేసిన భారీ సెట్‌లో జ‌రుగుతుంది.మ‌రి కొద్ది రోజుల‌లో ఈ చిత్ర షెడ్యూల్ ముగియ‌నుండ‌గా, త‌దుప‌రి షెడ్యూల్ కోసం చైనా వెళ్ళ‌నున్నార‌ట‌. సుమారు 20 రోజుల పాటు నాన్‌స్టాప్ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంద‌ట‌. ఈ షెడ్యూల్‌లో ముఖ్య‌మైన స‌న్నివేశాల‌ని చిత్రీక‌రించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్‌తో దాదాపు సినిమా షూటింగ్ అంతా పూర్త‌యిన‌ట్టేన‌ని అంటున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి, అమితాబ్ బచ్చ‌న్, న‌య‌న‌తార‌, జగపతిబాబు, సుదీప్, విజయ్‌ సేతుపతి,త‌మ‌న్నా తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రాజ‌గురువు పాత్ర పోషిస్తున్న అమితాబ్‌కి సంబంధించిన కొన్ని స‌న్నివేశాల‌ని ఇటీవ‌ల తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆయ‌న‌కి సంబంధించిన షూటింగ్ పార్ట్ ముగిసింది. ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

1698
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles