సైరా షూటింగ్ పూర్తి.. అతి త్వ‌ర‌లోనే విడుద‌ల‌

Tue,June 25, 2019 09:05 AM
Syeraa shooting completed

మెగాస్టార్ చిరంజీవి కెరియ‌ర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నాడు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు వంటి టాప్ స్టార్స్ న‌టిస్తున్నారు. అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా చిత్రం విడుద‌ల కానుంద‌నే టాక్ వినిపిస్తుంది. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ రీసెంట్‌గా పూర్తైంద‌ని చిత్ర సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. అంతేకాదు ఈ సినిమా కోసం హార్డ్ వర్క్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌తలు తెలిపారు. ప్ర‌స్తుతం చిత్రానికి సంబంధించి డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌తో పాటు డీఐ వర్క్ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. బ్రిటీష్ అధికారులకు, నరసింహారెడ్డికీ మధ్య జరిగే అతి కీలకమైన ఒప్పందాలకి సంబంధించిన స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తాయ‌ని అంటున్నారు. చిత్ర ట్రైల‌ర్‌ని మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 22న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.



515
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles