సైరా లుక్స్ లీక్ .. షాకింగ్‌లో చిత్ర యూనిట్‌..!

Tue,March 20, 2018 01:23 PM
SYERAA NARSIMHAREDDY MOVIE pic leaked

మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రం సైరా న‌ర‌సింహరెడ్డి. ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహ‌రెడ్డి జీవితం ఆధారంగా ఈ మూవీ తెర‌కెక్కుతుంది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీని రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌పై నిర్మిస్తున్నాడు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం మార్చి 15 నుండి సెకండ్ షెడ్యూల్ జ‌రుపుకుంటుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ రోజు న‌య‌న‌తార టీంతో క‌లిసింద‌ట‌. ప్ర‌స్తుతం చిరంజీవి .. నయనతార .. జగపతిబాబు కాంబినేషన్‌లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను, హైదరాబాద్ - నానక్ రామ్ గూడాలో చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగులో అమితాబ్ జాయిన్ కానున్నారు. తాజాగా సైరా చిత్రానికి సంబంధించి ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. చిత్ర యూనిట్ ఎన్ని జాగ్ర‌త్తలు తీసుకున్న‌ప్ప‌టికి ఫోటోలు లీక్ కావ‌డంపై చిత్ర బృందం ఆవేద‌న వ్యక్తం చేస్తుంది. లీకైన ఫోటోలో చిరంజీవి క‌నిపిస్తుండ‌గా, ఆయ‌న వెనుక న‌య‌న‌తార ఉన్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ ఫోటో క్లారిటీ లేక‌పోవ‌డంతో అది సైరా మూవీకి సంబంధించిన ఫోటో కాద‌ని మ‌రికొంద‌రు కొట్టి పారేస్తున్నారు. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

4177
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles