సైరాని చుట్టుముట్టిన మ‌రో స‌మ‌స్య‌

Sat,September 14, 2019 01:04 PM

తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత నేప‌థ్యంలో సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం సైరా. చిరంజీవి, అమితాబ్ బ‌చ్చ‌న్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్, జ‌గ‌ప‌తిబాబు, న‌య‌న‌తార, త‌మ‌న్నా వంటి స్టార్స్ ఈ చిత్రంలో భాగం కావ‌డంతో సైరా చిత్రంపై భారీ అంచ‌నాలు పెరిగాయి. అక్టోబ‌ర్ 2న చిత్ర విడుద‌ల‌కి మేక‌ర్స్ ప్లాన్ చేశారు. ఎన్నో అవ‌రోధాల‌ని దాటి ప్రేక్ష‌కుల‌కి ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మైన సైరాని తాజాగా మ‌రో స‌మ‌స్య చుట్టుముట్టింది.


సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రానికి కావ‌ల‌సిన స‌మాచారంతో పాటు , సినిమాకి అవ‌ర‌స‌ర‌మైన లొకేష‌న్స్‌, నరసింహారెడ్డి గారి జీవిత చరిత్రను పూర్తిగా చిత్ర బృందానికి తెలియ‌జేశాము. సినిమాకు కావాల్సిన పూర్తి సమాచారం తెలుసుకుని షూటింగ్ ను పూర్తి చేసుకొని ఇప్పుడు తమకు ఎలాంటి న్యాయం చేయడం లేదని ఉయ్యాలవాడ వంశీ యులు జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. చిరంజీవి తమకు న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారని కానీ ప్రస్తుతం తమకు ఎలాంటి న్యాయం చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. సైరా చిత్రం రామ్ చ‌ర‌ణ్ నిర్మాణంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బేన‌ర్‌పై నిర్మిత‌మైన సంగ‌తి తెలిసిందే.



2608
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles