సైరాలో ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ లీక్ చేసిన ప‌ర‌చూరి

Fri,August 24, 2018 10:50 AM
Sye Raa Narasimha Reddy DIALOGUE Revealed by Paruchuri Gopala Krishna

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం సైరా న‌ర‌సింహ‌రెడ్డి. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రెడ్డి జీవిత నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. చిరు బ‌ర్త్‌డేని పున‌స్క‌రించుకొని సైరా టీజ‌ర్ విడుద‌ల చేశారు. సోష‌ల్ మీడియాలో సునామి సృష్టించిన టీజ‌ర్ కేవ‌లం 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 12 మిలియ‌న్ డిజ‌ట‌ల్ వ్యూస్ సాధించి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్క టీజ‌ర్‌తో సినిమాపై భారీ అంచ‌నాలు పెరిగిపోయాయి.

సైరా చిత్రంకి సంబంధించిన ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్‌ని ప‌ర‌చూరి విడుద‌ల చేశారు. 12 ఏళ్ళ త‌ర్వాత ప‌ర‌చూరి బ్ర‌ద‌ర్స్ సైరా చిత్రానికి క‌థ అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో వారు రోమాలు నిక్క పొడుచుకునేలా డైలాగులు రాస్తున్నారు. రీసెంట్‌గా ప‌ర‌చూరి గోపాల‌కృష్ణ ప‌ర‌చూరి ప‌లుకులు అనే కార్య‌క్ర‌మంలో ప‌వ‌ర్ ఫుల్ డైలాగు గురించి చెప్పారు. ‘‘చేతులు వెనక్కి విరిచి కట్టేశాం. ముఖం ముందు ఉరితాడు వేలాడుతోంది. ఏంటిరా? ఆ ధైర్యం.. చావు భయం లేదా నీకు?’ అని అంటే ‘చచ్చి పుట్టినవాడిని.. చనిపోయిన తర్వాత కూడా బతికే వాడిని చావంటే నాకెందుకురా భయం’ అనే డైలాగ్ చెప్పారు. ఈ డైలాగ్ మెగా అభిమానుల‌లో జోష్ నింప‌డం ఖాయం అని అంటున్నారు. బుర్రా సాయి మాధ‌వ్ సైరా కోసం ప‌వర్ ఫుల్ డైలాగులు రాస్తున్న సంగ‌తి తెలిసిందే.

5541
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles