బ‌న్నీ ఫ్యాన్స్‌కి మరి కొద్ది నిమిషాల‌లో స్వీట్ స‌ర్‌ప్రైజ్‌

Thu,November 14, 2019 08:56 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం అల‌.. వైకుంఠ‌పుర‌ములో. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే రెండు సాంగ్స్ విడుద‌ల‌య్యాయి. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా.., రాములో రాములో.. అనే సాంగ్స్ యూ ట్యూబ్‌ని షేక్ చేస్తున్నాయి. ఇక‌ ఈ రోజు చిల్డ్ర‌న్స్ డే సంద‌ర్భంగా చిత్రం నుండి మూడో పాట విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే ఈ పాట‌తో బ‌న్నీ త‌న ఫ్యాన్స్‌కి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌నున్నాడ‌ని తెలుస్తుంది. ఆ స‌ర్‌ప్రైజ్ ఏంటంటే బ‌న్నీ కిడ్స్ అల్లు అయాన్‌, అల్లు అర్హా చిత్రం నుండి విడుద‌ల కానున్న మూడో పాట‌లో మెర‌వ‌నున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, దీనిపై పూర్తి క్లారిటీ ప‌ది గంట‌ల‌కి రానుంది. ఈ చిత్రం మ‌ల‌యాళ‌ములో అంగు వైకుంఠ‌పుర‌త్తు పేరుతో విడుద‌ల కానుంది. చిత్రంలో సుశాంత్, నివేదా పెతురాజ్‌, ట‌బు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సంద‌డి చేయ‌నున్నారు. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.



1126
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles